Hyderabad News: ఇటీవల కాలంలో పిల్లలు పుట్టేందుకు దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరిగాయి. ఒత్తిడి, జీవనశైలి మార్పులు, ఆలస్యమైన వివాహాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలు ఫెర్టిలిటీ సమస్యలకు దారితీస్తున్నాయి. మహిళల్లో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్ వంటి వైద్య సమస్యలు సాధారణమయ్యాయి. ఆధునిక వైద్య చికిత్సను అందిస్తున్నప్పటికీ, ఖర్చు, మానసిక ఒత్తిడి ఆందోళన కలిగిస్తాయి. పిల్లలు కోసం దంపతులు పడే కష్టాలు మామూలుగా ఉండడం లేదు. రూ.లక్షల ఖర్చు అయిన పెట్టేందుకు వెనుకాడడం లేదు. నెలల పాటు మందులు వాడుతారు. అయినా ఫలితం లేదని ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి ఇలా రకరకాల పేరులతో వెలుస్తోన్న ఆస్పత్రులకు వెళ్లి భారీగా ఖర్చులు పెడుతుంటారు. ఇలా నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు. తీరా చూస్తే ఫలితం ఉండదు.
ఇటీవల హైదరాబాద్ లో ఓ ఐవీఎఫ్ సెంటర్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మృతిచెందింది. ఇటీవల ఇలాంటి దారుణాలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో వైద్యులు ఓ మహిళకు తన భర్త వీర్యం కాకుండా మరో వ్యక్తి స్మెర్మ్ తో సంతానం కలిగించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ALSO READ: Akshara Devalla: చిన్న వయస్సులో అద్భుతమైన ఘనత సాధించిన అభినవ సత్యభామ అక్షర దేవళ్ల
ఓ మహిళ సంతానం కోసమని సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లింది. తన భర్త శుక్రకణాలతో సంతానం కలిగించాలని డాక్టర్లను కోరింది. దీంతో మహిళ వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నందకు సిద్ధమైంది. అయితే.. సంతానం కలిగిన తర్వాత పుట్టిన శిశువుకు క్యాన్సర్ రావడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో డీఎన్ఏ టెస్టులు చేయించారు. దీంతో శిశువు డీఎన్ఏ తన భర్త డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. బాధిత కుటుంబ సభ్యులు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు తరలించారు.
ALSO READ: Gaya News: దారుణం.. అంబులెన్సులో అమ్మాయిపై అఘాయిత్యం.. నరకం చూపించిన ఆ నలుగురు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యశాఖ రెవెన్యూ అధికారులతో కలిసి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతులను పరిశీలించడంతో పాటు గతంలో కూడా ఇదే తరహాలో మోసం చేసిన కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎంత మందికి ఇలా ట్రీట్ మెంట్ ఇచ్చారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.