Car Fire Accident: తుని జాతీయ రహదారిపై పెను ప్రమాదం చోటుచేసుకుంది. గెడ్లబీడు సమీపంలోని ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారును పక్కకు ఆపి బయటకు దిగిపోయారు. ఈ ఘటన కారణంగా అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. ప్రయాణికులు ముందుగానే అప్రమత్తం కావడంతో ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.