Rashmika -Vijay’s wedding: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాగాలు మోగుతున్నాయి. వరుసగా సెలబ్రిటీలందరూ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా రష్మిక విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రిలేషన్ లో ఉన్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలపై వీరిద్దరు ఎక్కడ స్పందించలేదు. ఇదిలా ఉండగా అక్టోబర్ 4వ తేదీ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది.
నిశ్చితార్థం గురించి విజయ్ దేవరకొండ, రష్మిక అధికారికంగా ప్రకటించకపోయిన పరోక్షంగా వీరిద్దరి నిశ్చితార్థం గురించి రష్మిక తెలియజేస్తూ వస్తున్నారు. ఇలా అక్టోబర్ లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ దేవరకొండ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding ) ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట ఉదయపూర్ ప్యాలెస్ (udaipur palace)లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం.
ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది. వివాహం అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇలా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ముందుగానే అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ పెళ్లి తేదీ గురించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండ వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
మరోసారి జంటగా రష్మిక, విజయ్..
రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూనే మరోవైపు ఇతర సినిమాల షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మిక నాలుగు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ సైతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా అనంతరం రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలో విజయ రష్మిక నటించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Rashmika: తన క్రష్ ఎవరో చెప్పేసిన రష్మిక… రౌడీ జిమ్ కు రండి అంటూ!