BigTV English

HBD Sai Kumar: భారీ బ్యాక్ గ్రౌండ్.. కానీ అడుక్కునే స్థాయి.. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సాయి కుమార్ సాధించిందేంటి?

HBD Sai Kumar: భారీ బ్యాక్ గ్రౌండ్.. కానీ అడుక్కునే స్థాయి.. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సాయి కుమార్ సాధించిందేంటి?

HBD Sai Kumar:సాయికుమార్.. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో తెలుగు ఆడియన్స్ హృదయాలను హత్తుకున్న విలక్షణ నటుడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు బీజేపీ పార్టీ సభ్యుడు కూడా. అటు ఫిలిం ఇండస్ట్రీలో కూడా భారీ బ్యాక్ గ్రౌండ్.. ఈయన తండ్రి ఎవరో కాదు పీ.జే.శర్మ (P.J.Sharma). అటు ఈయన తమ్ముళ్లు అయ్యప్ప శర్మ (Ayyappa Sharma), రవిశంకర్ (Ravi Shankar) లు ఇద్దరూ నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావడం గమనార్హం. అంతేకాదండోయ్ ఆయన వారసుడు ఆది సాయి కుమార్ (Adi Sai Kumar) కూడా సినీ నటుడే.


కొండంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..

1961 జూలై 27న మద్రాస్ లో పీజే శర్మ, కృష్ణ జ్యోతి దంపతులకు జన్మించారు. అటు తండ్రి పీజే శర్మ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో సాయికుమార్ కి బాల్యం నుంచే ఆ వృత్తిలో అడుగుపెట్టడానికి అవకాశం లభించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. సుమన్ (Suman ) , రాజశేఖర్ (Rajasekhar) సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పేవాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్చారణ బాగుండడంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడుగా అవకాశాలు కూడా లభించాయి.


బాల నటుడిగా సినీ ప్రస్థానం..

బాల నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన ఈయన మొదటి నుంచే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేయడం ప్రారంభించాడు. అలా ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్ (ANR ) నటించిన ‘సంసారం’ సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సాయికుమార్.. ఆ తర్వాత బాల నటుడిగా అవకాశాలు అందుకున్నారు. అలా తొలిసారి ‘దేవుడు చేసిన పెళ్లి’ సినిమాలో అంధుడి పాత్రలో అవకాశం అందుకున్నారు. ముందుగా కన్నడ చిత్రాలలో హీరోగా నటించి.. ఆ తర్వాతే తెలుగు సినిమాలలో నటించారు.

తిండి కోసం ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కునే స్థాయి..

ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సాయికుమార్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఇండస్ట్రీలోకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన తొలి నాళ్లల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “250 రూపాయలతో నా డబ్బింగ్ జీవితం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత రూ.500 ఇచ్చేవారు. మొదట ‘తరంగిణి’ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ సినిమాకి రూ.500 డబ్బింగ్ చెప్పినందుకు ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి నేను మరో రూ.250 పెంచి, రూ.750 ఇమ్మని అడిగాను. ఇక దాంతో నన్ను తీసేసి లక్ష్మీకాంత్ (Lakshmi kanth) అనే మరో ఆర్టిస్ట్ ను రంగంలోకి దింపారు. సుమన్ కి డబ్బింగ్ చెప్పడానికి.. దీంతో ఇదేంట్రా 250 రూపాయలు పెంచమని అడిగితే.. ఏకంగా తీసేశారు అని భయపడిపోయాను.

నెక్స్ట్ సినిమాకు రూ.1116లు ఇచ్చారు..

ఇక చేసేదేమీ లేక నేనే పరిగెత్తుకుంటూ వెళ్లి నన్ను తీసేయకండి సార్.. రూ.500 కూడా వద్దు.. ఏదో ఒకటి ఇవ్వండి.. కనీసం తినడానికి తిండి అయినా పెట్టి అవకాశం ఇవ్వండి అని అడిగాను. అయినా సరే కుదరదు అన్నారు. అదృష్టం ఏమిటంటే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అటు నేను డబ్బింగ్ చెప్పిన తరంగిణి సినిమా సూపర్ హిట్ అవడంతో మరో నెక్స్ట్ సినిమాకి పిలిచి మరీ రూ.1116లు ఇచ్చారు . అలా అవకాశం కోసం, కనీసం తిండి పెట్టండి చాలు అని అడుక్కున్నాను” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సాధించిందేంటి ?

1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఈయన.. ‘మయసభ’ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన, ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాపు దర్శకత్వం వహించిన ‘స్నేహం’ సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్.. ఆ తర్వాత తన కెరీర్ లో ఎన్నో మరుపురాని హిట్ చిత్రాలకు స్థానం కల్పించారు. ఇక అలా కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్గ్రీన్ చిత్రాలలో నటించారు.

సాయికుమార్ నటించిన చిత్రాలు..

కన్నడలో పోలీస్ స్టోరీ తర్వాత అగ్ని ఐపీఎస్, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ స్టోరీ 2 , కుంకుమ భాగ్య, మనే మనే రామాయణ, సెంట్రల్ జైలు అనే చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈయన తెలుగులో అమ్మ రాజీనామా, అంతఃపురం, ఈశ్వర్ అల్లా, కర్తవ్యం, ఎవడు, పటాస్, పండగ చేస్కో , జనతా గ్యారేజ్ , దసరా, సార్, మహర్షి, ఎస్ఆర్ కళ్యాణమండపం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో చిత్రాలు ఈయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

పలు పురస్కారాలు అందుకున్న సాయి కుమార్..

2006లో సామాన్యుడు చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న సాయికుమార్.. 2010లో ఉత్తమ సహాయ నటుడిగా మరో నంది అవార్డు అందుకున్నారు. ఇక తర్వాత టిఎస్ఆర్ టీవీ9 అవార్డును అందుకున్న ఈయన పలు ఫిలింఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలలో నటుడిగా, హీరోలకు డబ్బింగ్ చెప్పడం మాత్రమే కాదు బుల్లితెరపై ‘వావ్’ అనే షో కి కూడా హోస్టుగా చేసి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో సాయికుమార్ ప్రథమ స్థానంలో ఉంటారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈయన.. ఏ హీరోకి లభించని అరుదైన గౌరవాలు అందుకున్నారు. ఇక 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో కూడా ఇంకా బిజీబిజీగా గడపడం అంటే ఆయన ఏ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ:Pawan Kalyan: పవన్ తో ఒక్క సినిమా.. చచ్చిపోయినా చాలు.. ఇదెక్కడి పిచ్చి తల్లీ!

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×