BigTV English

Saiyaara Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న ‘ సైయారా ‘.. ఎన్ని కోట్లంటే?

Saiyaara Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న ‘ సైయారా ‘.. ఎన్ని కోట్లంటే?

Saiyaara Collections : బాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం ఊపేస్తున్న సినిమా సైయరా.. గత కొన్ని రోజులుగా ఈ మూవీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎంతోమంది ఈ సినిమా చూసి ఎమోషన్ అవుతున్న వీడియోలు, కొంతమంది యువత పెయింట్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. స్టోరీ పరంగా ఆకట్టుకోవడం మాత్రమే కాదు. అటు కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేయడంతో ఈ సినిమా హవా బాలీవుడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్స్ 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


9 రోజుల్లో 200 కోట్లు వసూల్..

ఈ సినిమాలో పెద్ద పెద్ద హీరోహీరోయిన్లు లేరు. అసలు ప్రచారమే లేదు. కానీ ఉన్నట్టుంటి సోషల్ మీడియాలో ఈ సినమా క్లిప్స్, సినిమా థియేటర్లలో సీన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంతో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. 9 రోజుల్లో 200 కోట్ల వసూళ్లను సాధించింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తర్వాత ఈ మూవీ నే భారీ విజయాన్ని అందుకుంది.. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ కి ఇలాంటి కలెక్షన్స్ రావడం బాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక నెల లోపల ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.. కొత్త వాళ్ళతో వచ్చిన ఈ క్యూట్ స్టోరీ బాగా ఆకట్టుకుంది. అందుకే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.


Also Read : యశ్వంత్ తో పరిచయం ప్రేమ.. అంత అతని దయ అంటున్న మోనిత ?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

క్రిష్ కపూర్‌కు సంగీతమంటే ఇష్టం. గొప్ప కంపోజర్ కావాలన్నది అతని కల. ఓ సందర్భంలో క్రిష్‌ని చూసిన ఒక జర్నిలిస్ట్ వాణీ బాత్రా అతడ్ని ఇష్టపడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక్కడ వరకు బానే ఉంది. అసలు కథ అప్పుడు మొదలవుతుంది. గతంలో ఆమె ప్రేమించిన ప్రియుడు మహేశ్ ఎంటర్ అవుతాడు. అతని ఎంట్రీ తో స్టోరీలో అనేక ట్విస్టులు ఎదురవుతాయి. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ ఏర్పడుతుందా లేదా అన్నది స్టోరీ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక క్యూట్ స్టోరీ.. హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్తవాళ్ళైనా బాగా నటించి మెప్పించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు సంపాదించి పెట్టింది. కేవలం మౌత్ టాక్‌తో సినిమా హిట్ అవగలదని ఈ సినిమా నిరూపించింది. ఇదే జోరులో కలెక్షన్స్ కొనసాగితే అతి త్వరలోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!

Betting Apps case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

War 2 Event : ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

Big Stories

×