Food Poisoning: నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలలో.. ఫుడ్ పాయిజన్ అయ్యి 64 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పాఠశాల సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో విద్యార్థినులకు స్నాక్స్‌గా పకోడి, రాత్రి భోజనంలో క్యాబేజీ కూర ఇచ్చారు. భోజనం చేసిన కొంతసేపటికే తొమ్మిది మంది విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులయ్యాయి.
దీంతో వారిని పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. తర్వాత క్రమంగా బాధిత విద్యార్థినుల సంఖ్య 50 వరకు పెరిగింది. వెంటనే వీరందరినీ 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం వరకు విద్యార్థుల సంఖ్య 64 పెరిగింది. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి సేప్టీ మేజర్స్ తీసుకోకుండా ఎందుకు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులు కోపగ్రహులు అవుతున్నారు.
Also Read: గుడ్ న్యూస్.. టీచర్ల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా..
ఈ ఘటనపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లలిత.. నిన్న మధ్యాహ్నం తోడుకొని పెరుగు తినడం వల్ల ఇలా అయ్యిందని తెలిపారు. ఆ పెరుగు తినడం వల్ల ఇండైజెస్ట్ అయ్యిందని.. అంతేకాని వంట చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. కానీ అక్కడ స్థానికంగా ఎవరైతే పని చేస్తున్నారో వారి నిర్లక్ష్యంతోనే విద్యార్ధులు ఫుడ్ పాయిజన్‌తో బాధపడాల్సి వస్తుందని కొందరు వ్యక్తులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ ఆర్డీవో సురేశ్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. తరువాత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడం చాలా బాధాకరమన్నారు. సంఘటనకు బాధ్యులైనపై చర్యలు తీసుకుంటామన్నారు. మహాత్మాజ్యోతి రావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆహారం వికటించి 64మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటన జరిగిన 10 గంటలు కూడా పూర్తి కాకముందే ఇవాళ ఉదయం మరో 20 మందికి ఉదయం ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.