Pawan Kalyan:సాధారణంగా అభిమానులకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఉంటారు. వారితో ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చినా చాలు అనుకునే వారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఒక నటి అభిమానం మాత్రం పీక్స్ కి చేరిపోయింది. తన అభిమాన నటుడితో ఒక్క సినిమా చేసి, చనిపోయినా చాలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆమె ఎవరు? ఆమె అంత అభిమానాన్ని చూపిస్తున్న ఆ సెలబ్రిటీ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఫ్యాన్స్ స్టేజ్ పై అందరి దృష్టిని ఆకర్షించిన నివితా మనోజ్..
ఆమె ఎవరో కాదు నివితా మనోజ్ (Nivitha Manoj).. హరిహర వీరమల్లు(Harihara Veeramalu) సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన ఈమె.. గతంలో ప్రభాస్ (Prabhas) ‘డార్లింగ్’ సినిమాలో కూడా నటించింది. నటిగా ఇండస్ట్రీకి పరిచయం కాకముందు టీవీ యాంకర్ గా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసింది. అంతేకాదు ఒక సీరియల్ లో లీడ్ రోల్ కూడా పోషించింది. ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. కానీ వీరమల్లు సక్సెస్ మీట్ లో ఈమె చేసిన చర్యలు కారణంగా భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ఈమె ఫ్యాన్స్ స్టేజ్ మీదకు వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి, ఆయన చేయి పట్టుకొని ఫోటో దిగింది. అంతేకాదు ఎక్సైట్మెంట్తో గంతులు వేసింది. ఇక ఆమె చర్యలతో పవన్ కూడా సిగ్గు పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈమె గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
పవన్ తో ఒక్క సినిమా.. ఆ తర్వాత చనిపోయిన చాలు – నివితా మనోజ్
ఇక దీంతో అటు పలు టీవీ ఛానెల్స్ కూడా ఈమెను ఇంటర్వ్యూ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తే.. వంద సినిమాలు చేసినట్టే అని నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) స్టేట్మెంట్ ఇవ్వగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని నివితా మనోజ్ దగ్గర కూడా ప్రస్తావించారు యాంకర్స్. ఇక ఆమె మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా చాలు. ఇంకేం సినిమా చేయకపోయినా పర్వాలేదు” అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
పవన్ తాగి పడేసిన వాటర్ బాటిల్ ని దాచుకున్న నటి..
అంతేకాదు పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ ని కూడా తాను దాచుకున్నట్లు, డస్ట్ బిన్ లో పడేయాల్సిన బాటిల్ ని ఇంటికి తీసుకెళ్లినట్లు.. తనది నిజమైన ప్రేమ అని, ఆ ప్రేమ ఆయనకు రీచ్ అవుతుందో లేదో అనుకున్నానని, ఇక ఆయనకి కూడా నేను తెలుసని” చెబుతూ తెగ సంతోష పడిపోయింది ఈ ముద్దుగుమ్మ.
నివేతా కామెంట్స్ పై నెటిజన్స్ భిన్నభిప్రాయాలు..
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈమె కామెంట్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ ని దాచుకునే అంత పిచ్చి అభిమానం ఏంటని కొంతమంది అంటే.. ఇంతటి వీరాభిమానిని మరెక్కడా చూడలేదని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమాని కి ఇప్పుడు ఊహించని పాపులారిటీ వచ్చేసింది. మరి ఇదే పాపులారిటీతో పలు సినిమాలలో అవకాశాలు లభిస్తాయేమో చూడాలి.
ALSO READ:Harihara Veeramallu: ఢిల్లీని తాకిన హరిహర వీరమల్లు.. ప్రత్యేక ప్రదర్శన ఎప్పుడంటే?