రైజింగ్ తెలంగాణ – 2047′ లో భాగంగా డిసెంబర్ 9న ప్రారంభం కానున్న గ్లోబల్ సమ్మిట్ – 2025 ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మీర్ ఖాన్ పేటలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి చేరుకోనున్నారు. 300 ఎకరాల్లో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ డీసీసీ నూతన అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ నియామకమ్యారు. పార్టీ కోసం చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు సంజీవ్ ముగిరాజ్. అనంతరం అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. బడుగు వర్గాల పార్టీ అయిన కాంగ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో గెలిపించేందుకు, ప్రభుత్వానికి-ప్రజలకు వారధిగా పనిచేస్తానని తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో సివిల్ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపారు. బంగారు వ్యాపారి శ్రీనివాసులును అప్పుల వ్యవహారంలో బలవంతంగా ఎత్తుకెళ్లి, ప్రైవేటు ఎస్టేట్‌లో బంధించారు. వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి, విజయవాడ సీఐ వసంతలు ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో కలకలం రేగింది. బాధితుడు ఇంటికి తిరిగి వచ్చాక, తన ఆస్తి డాక్యుమెంట్లు, దుకాణం తాళాలు తీసుకువెళ్లారని ఆరోపించారు.
ఏపీలో పత్తి, అరటి, మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. రైతులను ఆదుకునేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాయలసీమ అరటి రైతులు, రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మొక్కజొన్న రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
నల్గొండ డీసీసీ పదవి దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కులం తన పదవికి అడ్డంగా మారిందని.. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయని.. నిబద్ధతతో పనిచేసిన వారికి రావు అని ఆయన ఆరోపించారు. తన నాయకుడు కోమటిరెడ్డి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ వద్ద దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో, మేనమామ ఖదీర్ సొంత మేనల్లుడు షాహిద్ ను కారుతో ఢీకొట్టి చంపేశాడు. పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడం.. భార్య దూరం పెట్టడంతో పగ పెంచుకున్న ఖదీర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు గురై వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ బ్యాంక్ నుండి తీసుకున్న 70 వేలు అప్పు తీసుకోగా 20 వేలు బకాయి ఉండటంతో, ఫైనాన్స్ సిబ్బంది ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి డబ్బుల కోసం తీవ్రంగా వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించి స్పీకర్ ఇచ్చిన నోటీస్ గడువు నేటితో ముగిసింది. దీంతో లేఖ ద్వారా మరికొంత సమయం కావాలని దానం నాగేందర్ రిక్వెస్ట్ చేశారు
కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈరోజు ఆదివారం కావడంతో నాన్‌వెజ్ ప్రియులు దుకాణాల బాట పట్టారు. మటన్, ఫిష్ ధరలు సాధారణంగానే ఉన్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ ధర 250 రూపాయలకు పైబడి ఉన్నా వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో నాన్ వెజ్ వైపు మొగ్గుచూపుతున్నారు పబ్లిక్.
కామారెడ్డి ట్రాన్స్కోలో రూ. 10 లక్షల లోపు టెండర్ల డ్రా వాయిదా పడింది. నేడు డ్రా తీయాల్సి ఉండగా, ఎస్ఈ బదిలీపై వెళ్లడంతో ఇన్‌ఛార్జి లేక ప్రక్రియను నిలిపివేశారు. మరుసటి రోజు డ్రా తీస్తామని అధికారులు చెప్పగా, కాంట్రాక్టర్లు ఈ వాయిదాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా కార్తీకమాసం రాగానే ఒక పది శాతం కూరగాయలు రేట్లు పెరగడం సహజం. కానీ మొంథా తుఫాన్ ప్రభావంతో కూరగాయల తోటలు దెబ్బతినడంతో బయట నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఒక్కసారిగా మూడు రెట్లకు పైగా రేట్లు పెరిగిపోయాయి. సామాన్య మానవుడు కూరగాయల రేట్లు చెప్తే దడుచుకునే విధంగా తయారయ్యాయి.
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు మోక్షిత, తేజస్‌రెడ్డిలను ఆయన ఆశీర్వదించారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
కరీంనగర్ స్వశక్తి కళాశాలలో ఇందిరమ్మ మహిళా క్రాంతి చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై చీరలు పంపిణీ చేశారు. ఆడబిడ్టలకు సారె కింద చీరలు ఇచ్చే సంప్రదాయాన్ని కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని అన్నారు.
హైదరాబాద్‌లో పైరసీ వెబ్‌సైట్‌లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మూవిరూల్జ్ తీరు మార్చుకోవడంలేదు. రీసెంట్‌గా రిలీజైన ‘ప్రేమంటే’, ’12A రైల్వే కాలనీ’, ‘రాజా weds రాంబాయి’ వంటి కొత్త సినిమాలు ఒక్క రోజులోనే మూవిరూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్రింట్లు థియేటర్ల నుంచి క్యామ్ కార్డర్ల ద్వారా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఐబొమ్మ రవి పోలీసు అదుపులోనే ఉన్నాడు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్ పదవీకాలం నేటితో ముగిసింది. మే 14న బాధ్యతలు స్వీకరించిన ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో, రేపు సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు.
దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ..పాకిస్థాన్‌పై పలు ఆరోపణలు చేశారు. పొరుగునున్న పాక్ ఎర్రకట వద్ద పేలుడుకు కుట్ర పన్నిందన్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మౌనం వీడారు. ఓటమి బాధించిందని, ఎన్నికల్లో ఏదో తప్పు జరిగిందని, రిగ్గింగ్ జరిగినట్లు అర్థమవుతోందని పీకే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆధారాలు లేవని, భవిష్యత్తులో బయటపడతాయన్నారు పీకే.
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే . దీనిపై ఉక్రెయిన్ తో పాటు దాని మిత్ర దేశాల నంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో శాంతి ప్రణాళికపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రణాళిక చివరి ప్రతిపాదన కాదని పేర్కొన్నారు.
గువహటి టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అసహనం వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్. కుల్దీప్ ఓవర్ ప్రారంభించడానికి ఆలస్యం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఐసీసీ కొత్త క్లాక్ రూల్ ప్రకారం.. 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ మొదలు పెట్టాలి. ఆలస్యమైతే రెండు హెచ్చరికల తర్వాత, మూడోసారి ఐదు పెనాల్టీ పరుగులు విధించే అవకాశం ఉండటంతో పంత్ ఆందోళన చెందాడు.
రాజు వెడ్స్ రాంబాయి’ మూవీలో వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ అదరగొట్టాడు. తాజాగా చైతూ మాట్లాడుతూ..ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తే హ్యాపీగా ఉందన్నాడు. హీరో సిద్ధూ జొన్నలగడ్డ తన బ్రదర్ అని చెప్పి తన పేరును వాడుకోవాలని అనుకోలేదని, ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నానని చెప్పాడు.