E-Paper
Advertisement

కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!

కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!
Advertisement

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఒకవైపు సినిమాలలో నటిస్తూ.. మరొకవైపు సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా తన కొడుకులు ఇద్దరితో కలిసి ప్రత్యేకంగా పూజ నిర్వహించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి గత కొన్ని రోజులుగా ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా ధనుష్ తన ఇద్దరు కుమారులైన లింగ (Lingah),యాత్ర(Yatra)లతో కలిసి తిరువణ్ణామలై లోని ప్రసిద్ధ అన్నామలై ఆలయాన్ని సందర్శించడం ఇప్పుడు ఈ సరికొత్త చర్చలకు మరింత ఆజ్యం పోసింది.

కొడుకులతో కలిసి ప్రత్యేక పూజ..

ఈ దర్శనం ఆధ్యాత్మిక యాత్ర లేక రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అనుమానాలు సినీ, రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ధనుష్ తన కొడుకులిద్దరితో కలిసి చేయించిన ఈ ప్రత్యేక పూజకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సాంప్రదాయ దుస్తుల్లో ధనుష్ కనిపించి స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు కుమారులు లింగ,యాత్ర కూడా ఆలయ దర్శనంలో పాల్గొనడంతో పాటూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

ALSO READ:‘అగధ’ మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న ట్రైలర్!

రాజకీయ వార్తలకు మరింత ఆజ్యం..

ఇదిలా ఉండగా.. ఇటీవల ధనుష్ చెన్నైలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు కారణమయ్యాయి. అభిమాన సంఘాలు, సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక అదే సమయంలో నక్షత్రం గుర్తుతో పాటు ఎన్నంపోల్ వాజ్కై అనే నినాదంతో తెలుగు, ఎరుపు రంగులో రూపొందించిన జెండా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇప్పుడు సడన్గా మళ్లీ కొడుకులతో కలిసి పూజ నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ధనుష్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఓం చాప్టర్ వన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పైగా ఇటీవల అమరన్ చిత్రానికి జాతీయ అవార్డు లభించడంతో ఆయన నుంచి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అక్టోబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మమ్ముట్టి, సాయి పల్లవి , శ్రీ లీల, ఇంద్రన్స్ తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు 26 సంవత్సరాల తర్వాత నసీరుద్దీన్ షా తమిళ సినిమాకు తిరిగి వస్తుండడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థతో పాటు శ్రద్ధ అగర్వాల్ కు చెందిన ఆర్ టేక్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇక మరొకవైపు తమిళరసన్ పచ్చముత్తుతో మరో చిత్రం చేయబోతున్నారు ధనుష్.

Related News

కుక్కల కోసం లక్షల్లో …ఈ హీరోయిన్స్ లవ్ మాములుగా లేదుగా !

వారణాసి స్టోరీ బయటపెట్టిన రాజమౌళి.. రూమర్స్ కి చెక్ పెడుతూ!

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. గౌరీ ప్రియా కామెంట్స్ వైరల్ !

‘అగధ’ మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న ట్రైలర్!

ప్రైవేట్ పార్టీలో అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్..వీడియో వైరల్!

టాక్సిక్ మూవీలో 5మంది హీరోయిన్స్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈమెకే!

నాని – నితిన్ కొత్త మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

Big Stories

Advertisement
×