E-Paper
Advertisement

శివాని, శివాత్మిక అందుకే పెళ్లికి అంగీకరించడం లేదా.. రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

శివాని, శివాత్మిక అందుకే పెళ్లికి అంగీకరించడం లేదా.. రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rajasekhar: సాధారణంగా ఎక్కడైనా సరే ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లీడుకు వచ్చారు అంటే ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా అడుగుతుంటారు. ఇక సినిమా సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి కాస్త పెళ్లీడు వయసు వచ్చిందంటే చాలు పెళ్లెప్పుడు అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీ కిడ్స్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఇద్దరమ్మాయిలు కూడా పెళ్లీడు వచ్చినా ఇంకా సినిమాలపై, కెరియర్ పై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నలు ఎదురవగా.. ఆ ప్రశ్నలకు వారి తండ్రి సమాధానమిచ్చారు. మరి ఆ తండ్రి ఎవరు? ఆ పిల్లలు ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

కూతుళ్ళ పెళ్లిపై రాజశేఖర్ కామెంట్..

ఆయన ఎవరో కాదు యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్.. ఇటీవల బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన లోని మునుపటి నటనను కనబరిచి యాంగ్రీ మాన్ ఈజ్ బ్యాక్ అనేలా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్న ఈయన.. తాజాగా తమ కూతుళ్ల పెళ్లిళ్ల గురించి కూడా కామెంట్లు చేశారు. “నా కుమార్తెలు శివాని, శివాత్మికలు ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. నిజానికి పిల్లలకు పెళ్లి చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంది. అటు సంబంధాలు కూడా వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం మరికొన్నాళ్లు యాక్టింగ్ చేస్తామని చెబుతున్నారు. అందుకే వారి ఇష్టానికి ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలు ఆపాము” అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే శివాని, శివాత్మికలు సినిమా కెరియర్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలోనే పెళ్లి వాయిదా వేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

శివాని సినిమా కెరియర్..

శివాని సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి వంటి చిత్రాలను నిర్మించిన ఈమె 2018 లో వచ్చిన 2 స్టేట్స్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతో వెలుగులోకి వచ్చిన శివాని చివరిగా కోటబొమ్మాలి పీ.ఎస్., విద్యావాసుల అహం వంటి చిత్రాలలో నటించింది. అంతేకాదు అహనా పెళ్ళంట అనే సిరీస్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

also read:బ్రేకప్.. రీ ఎంట్రీ కోసం తిప్పలు పడుతున్న నివేదా?

శివాత్మిక సినిమా కెరియర్..

శివాత్మిక రాజశేఖర్ విషయానికి వస్తే.. తన సోదరితో కలిసి ఎవడైతే నాకేంటి , కల్కి, సత్యమేవ జయతే వంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈమె.. 2019లో విడుదలైన దొరసాని అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పంచతంత్రం , రంగమార్తాండ, విధి విలాసం వంటి చిత్రాలలో నటించిన ఈమె తన అక్క శివాని లాగే ఈమె కూడా తమిళ్, తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలపై ఫోకస్ చేశారు. కాబట్టి పెళ్లికి దూరం అని చెప్పవచ్చు.

Related News

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

Big Stories

×