BigTV English

Toxic: టాక్సిక్ నుండి హీరో లుక్ లీక్.. ఆ స్వాగ్ చూసారా?

Toxic: టాక్సిక్ నుండి హీరో లుక్ లీక్.. ఆ స్వాగ్ చూసారా?

Toxic:ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కన్నడ హీరో యష్ (Yash) కేజీఎఫ్ చిత్రాలలో నటించి పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఇప్పుడే చాలా కాలం తర్వాత టాక్సిక్ (Toxic) వంటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అనగా 2026 మార్చి 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ చిత్రాన్ని భారతీయ , అంతర్జాతీయ భాషలలో అనువాదం చేయనున్నారు.


టాక్సిక్ సినిమా విశేషాలు..

యాక్షన్ అడ్వెంచర్ మూవీగా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో యష్ తో పాటు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా , నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు వెంకట కే నారాయణ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం హీరో యష్ దాదాపుగా రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతోంది.

టాక్సిక్ నుండీ హీరో యష్ లుక్ లీక్..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి హీరో యష్ లుక్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. ఈ వీడియోలో బాల్కనీలో బేర్ బాడీతో సిక్స్ ప్యాక్ లుక్ లో స్టైల్ గా యష్ నిలబడి సిగరెట్ కాలుస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో యష్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఆ స్వాగ్ చూడండి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ మూవీ నుండి యష్ కి సంబంధించి లీకైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి అయితే హీరో ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు తెగ ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు.


also read:Nuvve Kavali: నువ్వే కావాలి@25 ఏళ్లు.. క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే!

యష్ సినిమాలు..

హీరో యష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు యష్. అంతేకాదు ఈ చిత్రానికి సహానిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మరో కొత్త ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఏది ఏమైనా హీరో యష్ ఇప్పుడు ఒక చిత్రం తర్వాత మరో చిత్రంలో నటిస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు.

Related News

Keerthy Suresh: జగపతి బాబుకి క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్‌.. కారణమేంటంటే!

Pooja hegde: పూజా హెగ్డే బర్త్డే.. స్పెషల్ విషెస్ తెలిపిన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్.. ఫోటో వైరల్!

Akhanda 2: అఖండ 2 నైజాం హక్కుల కోసం భారీ డీల్ …రంగంలోకి దిల్ రాజు!

Siddhu Jonnalagadda: ఆ సీన్‌ చేయనంటూ రాశీఖన్నా కోపంతో వెళ్లిపోయింది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Telusu Kada Trailer: గ్యారెంటీ ఇవ్వటానికి నేను సేల్స్ మ్యాన్ కాదు.. క్రేజీగా ‘తెలుసు కదా’ ట్రైలర్ !

Nuvve Kavali: నువ్వే కావాలి@25 ఏళ్లు.. క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే!

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..అందుకే ఆలస్యం అయిందా?

Big Stories

×