Viral Video: ప్రజా రవాణాలో ప్రయాణం అంటే ఎప్పుడూ ఒక రకమైన సవాలు. బస్సులోనో, ట్రైన్‌లోనో, మెట్రోలోనో ప్రయాణిస్తే మన చుట్టూ ఉండే ప్రజలతో కొంత అసౌకర్యం తప్పదు. కానీ కొన్నిసార్లు ఆ అసౌకర్యం అంతకంతకూ పెరిగిపోతూ ఇలాంటి ఘటనలా మారిపోతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో మెట్రోలో నిలబడి ఉన్న ఒక మహిళ చంకలోని దుర్వాసనతో ఎదురుగా కూర్చున్న మనిషి తన దగ్గర ఉన్న సెంటు స్ప్రే చేసిన ఘటన చర్చనీయాంశమైంది. ఆ సువాసనతో కాస్త రిలీఫ్ అని అనుకున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు కానీ ఆ మహిళ మాత్రం మండిపడింది ఎందుకు ఇలా చేశావు?” అని ప్రశ్నించగా, ఆ వ్యక్తి ప్రశాంతంగా “మీ చంక నుంచి దుర్వాసన వచ్చింది అందుకే” అని చెప్పడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా కామెడీగా మారిపోయింది.
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇలాంటి అనుభవం చాలామందికి తలెత్తే సమస్య. మనం బస్సు, మెట్రో, ట్రైన్లలో ప్రయాణిస్తుంటే పక్కన ఉన్న వ్యక్తి తాను పడకుండా గ్రిప్ కోసం చేయి పైకి లేపినప్పుడు ఒక అసహన కరమైన వాసన మన ముక్కుకు తగిలి కష్టంగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పలేం, దూరంగా కూర్చోలేం, బయటకు వెళ్ళిపోలేం అటువంటి పరిస్థితిలో ఉన్నవారు అర్థం చేసుకుంటారు ఎంత ఇబ్బందో.
Also Read: Flipkart vs Amazon: ఆఫర్ల హంగామాలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోరు.. ఎవరిది నిజమైన డీల్
ఇది చిన్న విషయమని కొందరు భావించొచ్చు కానీ వ్యక్తిగత శుభ్రత అంటే ప్రజా పరిశుభ్రత (public hygiene) లో ఒక భాగం. చంకల్లో దుర్వాసన రావడం అనేది సాధారణమైన సమస్యే కానీ దాన్ని పట్టించుకోకపోవడం పెద్ద తప్పు. రోజూ స్నానం చేయకపోవడం, చెమట ఎక్కువగా రావడం, కాటన్ కాని దుస్తులు ధరించడం వలన ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.
అదే కాకుండా మెట్రో, బస్సు, ఆఫీస్ లాంటి చోట్ల ప్రజల మధ్య మనం ఎలా కనిపిస్తామన్నదానికన్నా, మన వాసన ఎలా ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. మన వాసన మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. శుభ్రత అంటే కేవలం బాహ్యంగా బాగుండడం కాదు మన శరీరం నుంచి వచ్చే వాసన కూడా మన ప్రెజెన్స్ ని ప్రభావితం చేస్తుంది.
ఇలా ఉండి కూడా కొందరు అంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద చర్చ ఎందుకు? అని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి మెట్రోలో, లేదా ఆఫీసు లిఫ్ట్‌లో, ఇలాంటి దుర్వాసన అనుభవించినప్పుడు ఆ ఇబ్బంది ఎంత కష్టమో అర్థమవుతుంది. అది కేవలం మనకే కాదు, మన చుట్టూ ఉన్నవారికీ ఇబ్బంది కలిగించే విషయం.
ఇలాంటి ఘటనలు మనకు నవ్వు తెప్పించినా, ఆలోచించాల్సిన విషయం మాత్రం అదే మన వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదు. ప్రజల మధ్య జీవిస్తున్నప్పుడు మన ప్రవర్తన, మన పరిశుభ్రత, మన వాసన కూడా మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మరి మీరు ఏమంటారు? ఆ వ్యక్తి చేసిన పని సరైనదేనా? లేక చెప్పే విధానం తప్పా?
ఇదిగో వీడియో కాసేపు..👇🫣😁
He should be a highly paid employee for subway system. 😂 pic.twitter.com/XRrrzr7xqs
— SULLY (@SULLY10X) October 12, 2025