Siddhu Jonnalagadda About Raashi Khanna: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలుసు కదా‘. రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పిటకే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టబర్ 17న విడుదలకు సిద్ధమతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్తో బిజీగా ఉంది. వరుస ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్‌తో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా, దర్శకురాలు నీరజ కోనలు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సిద్దు జొన్నలగడ్డ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో.. సినిమాల్లోని ఆయన పాత్రలు అలాగే ఉంటాయి. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో సిద్దూ పాత్ర యూత్ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత జనరేషన్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్కి రిలేటెడ్గా ఆయన రోల్స్ ఉంటాయి. యూత్ని టార్గెట్ చేస్తూ లవ్స్టోరీలు చేస్తుంటారు. ఆయన కథలు, పాత్రలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ఈ తెలుసు కదా సినిమా విషయానికి వస్తే.. చూట్టూ అంత అమ్మయిలే ఉన్నారు. డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు, ఇతర కాస్ట్ క్రూడ్ అంత ఫీమేల్స్. వాళ్లందరి మధ్యలో షూటింగ్ ఎలా జరిగింది, ఏమైనా ఆందోళనకు గురయ్యారని అని విలేకరి ప్రశ్నించారు. దీనికి సిద్దూ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
“సినిమాలో వరుణ్ రోల్ ర్యాడికల్గా ఉంటుంది. చాలా ర్యాడికల్ రోల్ ఇది. లవ్, పెళ్లి గురించి చెప్పే మాటలు. క్యారెక్టర్ ఐడియాలజి, థింకింగ్ అన్ని కూడా చాలా ర్యాడికల్గా (హార్స్ కామెంట్స్,ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడటం) ఉంటాయి. అప్పుడు ఎదుటి వ్యక్తి కోపం, బాధ ఇస్తాయి. అందుకే క్లైమాక్స్ సీన్ షూటింగ్లో నా మాటలు, డైలాగ్కి రాశీ ఖన్నా సెట్ నుంచి అలిగి వెళ్లిపోయింది. ఈ సీన్ నేను చేయనంటూ షూటింగ్ ఆపేసి వెళ్లిపోయిది. అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ఫ్రెండ్. ఇలా మాట్లాడితే నేను చంపేస్తాను, ఓదిలేస్తాను” కోపంతో పక్కకు వెళ్లిపోయింది. తన వల్ల 40 నిమిషాల వరకు షూటింగ్ ఆగిపోయింది. నేను వెళ్లి ఇది సినిమా, నువ్వు రాశిఖన్నా.. అంజలి కాదు అని నచ్చజెప్పి సెట్స్‌కి తీసుకువచ్చాను.
నిజంగా ఇంతమంది ఆడవాళ్ల మధ్య వరుణ్ రోల్ పోషించడం నాకు సవాలుగా అనిపించింది. ఎందుకంటే రాశీఖన్నా టీంలో ఇద్దరు ముగ్గురు అమ్మయిలు ఉంటారు. అలాగే శ్రినిధి శెట్టి, డైరెక్టర్ నీరజ కోన టీంలో కూడా అందరు అమ్మాయిలే. అలా సెట్లో 15 నుంచి 16 మంది ఆడవాళ్లు ఉంటారు. వాళ్లందరి మధ్య నేను ఒక్కడినే అబ్బాయి. వాళ్ల మధ్యలో నిలుచుని ఈ ర్యాడికల్ రోల్ పోషించాను. డైలాగ్ చెప్పిన తర్వాత నాకు చాలా ఆందోళనగా అనిపించేది. సెట్లో చూట్టూ 15 మంది ఉండేవాళ్లు.. షాట్ అయిపోయి పక్కకు వెళ్తుంటే అంతా నన్ను సీరియస్గా చూసేవారు. భయంభయంతో వాళ్లని కాస్తా జరగండి అంటూ పక్కకు వెళ్లి కూర్చోని వాడిని అంటూ సిద్దూ చెప్పుకొచ్చాడు.