Telusu Kada Trailer: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) రాశి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం “తెలుసు కదా”(Telusu Kada). ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు. 2.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియోని ఎంతో అద్భుతంగా కట్ చేశారు .ఇక ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని స్పష్టమవుతుంది. అదేవిధంగా అమ్మాయిల ప్రేమ గురించి, ప్రేమకు వ్యారంటీ ఇవ్వడం గురించి సిద్దు జొన్నలగడ్డ చెప్పే డైలాగులు యువతను ఆకట్టుకుంటాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ ట్రైలర్ వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు కూడా మంచి అంచనాలను పెంచేసాయి. తాజాగా ట్రైలర్ వీడియో చూస్తుంటే మాత్రం యూత్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఈ సినిమాలో ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నలగడ్డ మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన(Neeraja Kona) మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన సంగతి తెలిసిందే.
నీరజ కోన ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి, మొదటిసారి దర్శకురాలిగా మారారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే ఎంతో అనుభవం కలిగిన దర్శకుడు చేసిన సినిమా అనే భావన కలుగుతుంది. అంత అద్భుతంగా ఈమె ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ ఇటు రాశీఖన్నా, సిద్దు జొన్నలగడ్డ శ్రీనిధి శెట్టి ముగ్గురికి కూడా ఎంతో కీలకంగా మారింది.
రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన హీరో..
సిద్దు జొన్నలగడ్డ ఇటీవల జాక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సిద్దు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు రావడంతో హీరో సిద్దు సైతం తన రెమ్యూనరేషన్ కొంత భాగం వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పై మాత్రం ఈయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, కచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ అందుకోబోతున్నామని వెల్లడించారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరో నాలుగు రోజులు వేచి చూడాలి.
Also Read: Akhanda 2: అఖండ 2 నైజాం హక్కుల కోసం భారీ డీల్ …రంగంలోకి దిల్ రాజు!