Yash Dual Role in Role: ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు పొందాడు కన్నడ హీరో యశ్. శాండల్ వుడ్ రాక్ స్టార్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యశ్.. కేజీయఫ్ తో పాన్ ఇండియా హీరోగా మారాడు. కేజీయఫ్ తర్వాత ఈ హీరో బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవుతాడు అనుకున్నారు. కానీ, కేజీయఫ్ వచ్చి మూడేళ్లు అవుతుంది. కానీ, ఇంతవరకు యశ్ నుంచి ఒక్క సినిమా లేదు. కాస్తా విరామం తర్వాత ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మూవీని ప్రకటించాడు.
టాక్సిక్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్
ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కేజీయఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యశ్ నుంచి వస్తున్న చిత్రమిది. దీనిపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఇండయన్ మూవీ లవర్స్ తో పాటు, విదేశీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘టాక్సిక్’ని హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ దిగ్గజాలు వర్క్ చేస్తుండటంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె పెర్రీని రంగంలోకి దింపారు. ఇప్పటికే సెట్ లో అడుగుపెట్టిన ఆయన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
యశ్ డ్యూయెల్
ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో యశ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు. టాక్సిక్ లో హీరో యశే.. విలన్ కూడా యశ్ అంట. ఒకేసారి యశ్ పాజిటివ్, నెగిటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రకటనతోనే టాక్సిక్ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ వాటిపై మరింత బజ్ పెంచుతున్నాయి.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ సినిమాకు వర్క్ చేయడం, మరోవైపు యశ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్టు అప్డేట్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. జె.జె పెర్రీ ఇండియన్ స్టంట్ టీంతో ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. అయితే దీనిలో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనున్నట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ కోసం ఇండియన్ స్టంట్ టీంను మాత్రమే తీసుకుని యాక్షన్ సీక్వెన్స్ భారీగా హాలీవుడ్ స్థాయికి ధీటుగా ప్లాన్ చేశారట పెర్రీ. అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తామని తెలిపారు.