Srikanth Iyengar : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్..ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వేరే భాష వ్యక్తి అయిన తెలుగులో ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి జనాల మనసు దోచుకున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు. కానీ కొన్నిసార్లు నోటిదూలతో కోరి సమస్యలను తెచ్చుకుంటాడు. ఈ మధ్య ఏదొక వార్తల పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నా మధ్య మహాత్మ గాంధీ ని తక్కువ చేస్తూ మాట్లాడి ట్రోల్స్ కు గురయ్యాడు. బూతులు తిడుతూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు. అది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. తాజాగా ఆయన చేసిన ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు సినిమాపై ఎఫెక్ట్ చూపించాయి.. ఆ మూవీకి నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే..
స్వాతంత్ర సమరయోధుడు.. జాతిపిత మహాత్మా గాంధీ పై సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ బూతులు తిట్టిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆయనను ఇండస్ట్రీ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గాంధీ అభిమానులు. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ, ఆయనని అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. తాజాగా నటుడు నోటి దూల వల్ల సినిమాకు పెద్ద నష్టం వచ్చి పడింది. ఈయన నటించిన తాజా చిత్రం అరి.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈయన నటించిన సినిమాలను ఏవి థియేటర్లలో ఉండనివ్వము అంటూ గాంధీ అభిమానులు నిరసన మొదలుపెట్టారు. ఆయనను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేంత వరకి నిరసనలు కొనసాగవు అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈయన వల్ల ఆ సినిమాకు భారీ నష్టం వాటిల్లింది. మరి చిత్ర యూనిట్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నీచంగా మాట్లాడాడు అంటూ శ్రీకాంత్ అయ్యంగారిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు గాంధీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు లేకుంటే స్వాతంత్రం వచ్చేది కాదు. ఆయన చేసిన సూచనల వల్లే గొప్ప సమరయోధులందరూ స్వాతంత్ర్యంలో పాల్గొని మనకు స్వాతంత్రం తెచ్చారు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మహాత్ముడు ఎంతోమందిని లైంగికంగా వేధించాడని చరిత్ర చెబుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసి సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రమాదముంది… ఇలాంటివారిని ఏం చేసినా పాపం లేదు. ముందు ఈయనను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి.. రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి అంటూ ఇప్పటికే నిరసన మొదలైంది. దేశవ్యాప్తంగా ఈయనకు వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఈ పరిస్థితిపై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా స్పందిస్తారో చూడాలి..