Kantara Chapter1 pre release: కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా తిరిగిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). రిషబ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్(Ntr) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రిషబ్ శెట్టి కాంతార సినిమా కంటే కూడా ఎక్కువగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ వేడుకకు వచ్చిన వారందరికీ ఈయన నమస్కారాలు తెలియజేయడమే కాకుండా తమ సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడం పట్ల కూడా ఈయన సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు కానీ ఎన్టీఆర్ అన్న స్పీచ్ వినడానికే వచ్చానని తెలియజేశారు. ఎన్టీఆర్ ని చూస్తే నాకు ఎప్పుడూ కూడా ఒక హీరో అనే భావన ఉండదు ఒక సొంత బ్రదర్ లాగా, మన సొంత పల్లెటూరి అబ్బాయి అనే భావన కలుగుతుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే వారి అమ్మగారు అలాగే ఎన్టీఆర్ భార్య గారు సొంత కుటుంబ సభ్యుల లాగే మమ్మల్ని చూసుకుంటారని ఈ సందర్భంగా రిషబ్ తెలియజేశారు.
ఈ సినిమా వేడుక హైదరాబాదులో జరుపుకోవడం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమాకి తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలని ప్రతి ఒక్కరూ అక్టోబర్ రెండవ తేదీ ఈ సినిమా చూడటం కోసం థియేటర్ కు రావాలని ఈయన అభిమానులను ప్రేక్షకులను కోరారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా రావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అలాగే ఎన్టీఆర్ కారణంగా ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడిందనే చెప్పాలి.
భారీగా పెరిగిన అంచనాలు..
ఇక ఈ సినిమా కాంతార సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంభళే నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీన ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!