Heroine Sneha: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. ఒకప్పుడు తమ అందంతో , నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎంతోమంది సెలబ్రిటీలు.. సడన్ గా అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడం.. ఆ విషయాలను అభిమానులతో పంచుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అందాలతో హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి స్నేహ(Sneha ) మంచానికే పరిమితమైందని , కదలలేని పరిస్థితిలో ఉందని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ భారీ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మన్ననలు సొంతం చేసుకుంది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఒక్కసారిగా వెండితెరకు దూరమైన ఈమె.. పెళ్లి, పిల్లల వల్లే గ్యాప్ ఇచ్చిందని అందరూ అనుకున్నారు . కానీ ఆ గ్యాప్ వెనుక ఉన్న చేదు అనుభవం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ ఆ ప్రమాదం తన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తన ఆరోగ్య విషయంపై స్నేహ మాట్లాడుతూ..” నా కెరియర్లో వరుస సినిమాలతో నేను బిజీగా ఉన్న సమయంలోనే ఒక ఘోర ప్రమాదానికి గురయ్యాను. ఆ ప్రమాదంలో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం లేచి నిలబడాలన్నా కూడా నాకు మినిమం 8 నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో మానసిక వేదనకు లోనయ్యాను. ఇక ఇంతటితో నా కెరియర్ ముగిసిపోయిందనుకున్నాను . ఆ సమయంలో దర్శకుడు కరుపళనియప్పన్ ‘పార్థిబన్ కనవు’ కథతో నన్ను సంప్రదించారు. కదలలేని స్థితిలో ఉన్నానని తెలిసి కూడా ఆయన తన సినిమా కోసం పిలవడం చూసి ఆశ్చర్యపోయాను. కానీ ఆయన ఇచ్చిన ధైర్యం.. చూపించిన నమ్మకమే మళ్లీ నన్ను కోలుకునేలా చేసి, ఇలా మీ ముందు నిలబెట్టింది.. ఆ ప్రోత్సాహం వల్లే కెమెరా ముందుకు రాగలిగాను” అంటూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది స్నేహ. మొత్తానికైతే మంచానికే పరిమితమై కదలలేని పరిస్థితుల్లో ఉండిపోయానని చెప్పడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్నేహ తన జీవితంలో ఇంతటి దుర్భర జీవితాన్ని అనుభవించిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Peddi Second single: పెద్ది సెకండ్ సింగిల్ ప్రోమో.. ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీమ్!
స్నేహ కెరియర్ విషయానికొస్తే.. ఈమె అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. ఎక్కువగా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె 1981 అక్టోబర్ 12న ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు కుటుంబంలో జన్మించింది. ఇకపోతే ఈమె తాత మామలు ముంబైకి మకాం మార్చడంతో అక్కడే జన్మించిన ఈమె.. ఆ తర్వాత షార్జాకు వెళ్ళింది. అక్కడే పెరిగింది . 12వ తరగతి వరకు చదువుకున్న ఈమె షార్జా లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఒక మలయాళ నిర్మాత స్నేహాను చూసి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ‘నీల పక్షి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్నేహ సంక్రాంతి , రాధాగోపాలం, శ్రీరామదాసు ఇలా పలు చిత్రాలలో నటించి మెప్పించింది.