 
					Nandamuri Balakrishna Warning to Hyper Aadi: హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కామెడీ పంచ్, డైలాగ్స్కి ప్రత్యేకమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోలో ఆది స్కిట్స్కి విపరీతమైన క్రేజ్ ఉంది. తెరపై ఆది కనిపించాడంటే ఆడియన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్టే. జబర్దస్త్ స్టేజ్ అయినా, వెండితెర అయిన ఆది కనిపిస్తే ఆడియన్స్ ఫల్ ఎంజాయ్ చేస్తారు. అతడి కామెడీకి పొట్టలు చెక్కలు అవ్వాల్సిందే. మాటల్లోనే కామెడీ పండించడం ఒక్క ఆదికే సాధ్యం.
తన స్కిట్స్లో ఎవరోఒకరిని టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో పంచులు, ఛలోక్తులు పేలుస్తుంటాడు. అలా ఆది వివాదంలో నిలిచిన సంఘటనలు కూడా చాలనే ఉన్నాయి. అయితే ఓసారి ఏకంగా తన స్కిట్తో నందమూరి బాలకృష్ణకే కోపం తెప్పించాడట. దీంతో ఆదిని చంపేయమంటూ ఆయన ఆర్డర్ వేశారట. ఈ విషయాన్ని స్వయంగానే ఆదినే వెల్లడించాడు. జబర్థస్త్ షో తో లైమ్లైట్లోకి వచ్చాడు ఆదిగా. తన స్కిట్లో ప్రయోగం చేస్తూ ఆడియన్స్ని ఆకట్టుకునేవాడు. ఈ క్రమంలో ఎంతో సినీ, రాజకీయ సెలబ్రిటీలను ఇమిటేట్ చేయడం ఆది నైజం.
అంతేకాదు బాగా కాంట్రవర్సల్ అయిన సంఘటనలను కూడా తని స్కిట్లోనే వాడేస్తాడు. నిత్యం మన చూట్టూ జరిగే సంఘటనలతో జబర్దస్త్ వేదికపై కామెడీ స్కిట్గా తీసుకువచ్చేవాడు. అయితే ఓ స్కిట్లో ఆది దివంగత నటుడు , మాజీ సీఎం నందమూరి తారక రామరావు (సీనియర్ ఎన్టీఆర్) గెటప్ వేశారట. దీనిపై బాలయ్య హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహం చూపించాడట. చంపేస్తానంటూ ఫోన్ చేసి బాలయ్య బెదిరించినట్టు గతంతో ఓ ఇంటర్య్వూలో ఆది అన్న ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో హైపర్ ఆదిని చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ఈ ఇంటర్య్వూలో బాలయ్య వార్నింగ్ కాల్‌పై ఆది స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ఓ రోజు బాలకృష్ణ గారి పీఏ నుంచి ఫోన్ వచ్చిది.
Also Read: Bigg Boss : బిగ్‌బాస్ తనూజపై మాజీ కంటెస్టెంట్స్ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్.. వీడియో వైరల్!
“హలో.. నేను బాలకృష్ణ గారి పీఏని మాట్లాడుతున్నా.. బాలకృష్ణ గారు మిమ్మల్ని చంపేయన్నారు’ అని అన్నారు. ఆయన నను చంపేయమనడం ఏంటని అనుకున్నారు. స్కిట్లో ఎన్టీఆర్ గారి గెటప్ వేసినందుకు అలా అన్నారని అర్థమైంది. బాలకృష్ణ ఏంటి మిమ్మల్ని చంపేస్తా.. అని ఎందుకు అన్నారని యాంకర్ అడగ్గా.. “నేను అదిరే అభి టీంలో ఉండేవాడిని ఓ స్కిట్‌లో భాగంగా ఎన్టీఆర్ గెటప్ వేశాం. వాస్తవానికి ఆ గెటప్ వేసింది ఫని. కానీ, బెదిరింపులు మాత్రం నాకు వచ్చాయి. ఆ ఫోన్ అభికి వచ్చినా ఆ స్కిట్‌లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఇది నిజంగా జరిగింది. బాలకృష్ణ గారు చంపేయమన్నారా? ఓకే ఇక నుండి ఇలాంటివి ఉండవండీ థాంక్యూ అని చెప్పాను. ఆ తరువాత నుండి అలాంటివి తగ్గించాం. ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చనిపోయిన జగ్గయ్య గారి స్కిట్‌లు వేసుకుంటున్నాం” అని చెప్పుకొచ్చాడు.