 
					Rahul Ravindran: సినీ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన దర్శకుడిగా పరిచయం అవుతూ చి ల సౌ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈయన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే . తాజాగా ఈ ట్రైలర్ టీజర్ గురించి రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ట్రైలర్ టీజర్ ద్వారా మేము మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించామని తెలిపారు.
ట్రైలర్ లో మీరు చూసిన బావోద్వేగమైన, హై-వోల్టేజ్ డ్రామా రెండవ భాగంలో కూడా కొనసాగుతుంది. ఇది ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుందని తెలిపారు. ఒక జంట నిజ జీవితంలో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకున్న విధంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దాను. అయితే ఇందులో అందరూ అనుకున్న విధంగా ఎలాంటి నైతిక సందేశాలు కానీ ,పాఠాలు కానీ లేవని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కూడా వారి సొంత మార్గంలోనే ఆలోచిస్తారని నేను బాగా నమ్ముతున్నాను. ఈ సినిమా ఒక బావోద్వేగమైన ప్రేమ కథ అంటూ రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
పాజిటివ్ రివ్యూ ఇచ్చిన సెన్సార్..
ఇక ఈ సినిమాలో రష్మిక (Rashmika)ఒక కాలేజీ అమ్మాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం పక్కా అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: Mahesh Babu Kalidas -Sandra : పెళ్లి బంధంతో ఒక్కటైన బుల్లితెర జంట..ఫోటో వైరల్!