 
					Bigg Boss Telugu 9 : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో కి రివ్యూ చెప్పే ఆదిరెడ్డి ఆ షో కంటెస్టెంట్ గా కూడా మారాడు. అయితే ఆదిరెడ్డి కూడా ప్రస్తుతం బిగ్ బాస్ 9 సీజన్ కి సంబంధించి రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందరికంటే చాలా అప్డేట్స్ ముందే చెప్తున్నాడు. అయితే కొంతమంది కంటెస్టెంట్లు కు పాజిటివ్గా రివ్యూ చెప్పడం వలన తనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అయితే ఆదిరెడ్డి తనను ట్రోల్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఏ అకౌంట్ నుంచి అయితే తనను హెరాస్ చేశారో, అలానే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టారో అదంతా స్క్రీన్ రికార్డర్ చేసి ప్రూఫ్ లా ఉంచాడు. దానిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు ఆదిరెడ్డి.
ట్విట్టర్ వేదికగా వీడియోని పోస్ట్ చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పోలీసుల డిపార్ట్మెంటును మెన్షన్ చేశాడు. మెన్షన్ చేస్తూ ఆ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. అయితే దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.
ప్రతి ఒక్కరికి కొందరు ప్రత్యేకమైన ఇష్టమైన కంటెస్టెంట్లు ఉంటారు. వాళ్ల గురించి పాజిటివ్ గా చెబుతున్న తరుణంలో మిగతా కంటెస్టెంట్ ని ఇష్టపడే వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక కంటెస్టెంట్ కి పిఆర్ చేసేవాళ్లు ఆది రెడ్డికి ఇలా చేసి ఉండొచ్చు అనేది చాలామంది అభిప్రాయం.
విష్ణు ఫ్రమ్ హైదరాబాద్ అనే అకౌంట్ తో ఆదిరెడ్డిని ట్రోల్ చేశాడు ఆ వ్యక్తి. అయితే మొత్తానికి భయపడి ఆ సోషల్ మీడియా ఎకౌంటును డిలీట్ చేశాడు. చాలా తెలివిగా ఆదిరెడ్డి ముందే దానిని స్క్రీన్ రికార్డ్ చేసి ఉంచడం వలన నేడు దొరుకుపోవలసిన పరిస్థితి.
Also Read: Bigg Boss 9 Priya Shetty : భరణిను టార్గెట్ చేసిన ప్రియా శెట్టి, బిగ్ బాస్ యాజమాన్యానికి చురకలు