 
					Prashanth Neel Calls Rajamouli Is Road Contractor: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మల్టిస్టార్ చిత్రం బాహుబలి ఈ రోజు రీ రిలీజైంది. 2015లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీ స్థాయిలో అక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ మూవీతో పాన్ ఇండియా అంటూ భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త ట్రెండ్ని పరిచయం చేశాడు జక్కన్న. ఎపిక్ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లపైనే వసూళ్లు చేసి టాలీవుడ్ని అగ్ర స్థానంలో నిలబెట్టింది.
ఈ దెబ్బతో జక్కన్న పేరులో ఇంటర్నేషనల్ వైడ్గా మారుమ్రోగింది. ఇక ప్రభాస్, రానాలకు గ్లోబల్ స్టార్లుగా నిలబెట్టిన ఈ చిత్రం ఈ రోజు మళ్లీ థియేటరల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో రీ–రిలీజ్ చేశారు. రెండు భాగాలున్న ఈ సినిమా ఎడిట్ చేసి ఒక్క పార్ట్గా విడుదల చేశారు. ఇందులో కొన్ని సీన్లు కట్ చేసి కొత్త సీన్లు యాడ్ చేసి ఆడియన్స్కి కొత్త అనుభూతిని అందించారు.
ఈ రోజు రీ రిలీజ్ అయిన ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ దిగ్గజాలు సైతం బాహుబలి: ది ఎపిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి ఇండస్ట్రీలో హద్దులు చెరిపేశారని, పాన్ ఇండియా అంటూ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారంటున్నారు. బాహుబలి రెండు భాగాలు ఎంత అద్భుతం చేశాయో.. బాహుబలి: ది ఎపిక్ కూడా మరో సంచలనం అంటూ కొనియాడుతున్నారు. కొత్తగా యాడ్ అయిన సీన్స్ కూడా గూస్బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. అలాగే బాహుబలి: ది ఎపిక్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివ్యూ ఇస్తూ జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాహుబలి సినిమాను పొగుడుతూనే జక్కన్నను రోడ్డు కాంట్రాక్టర్ అని పిలిచారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇవాళ బాహుబలి: ది ఎపిక్ చూసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఇండస్ట్రీని రోడ్డుగా, రాజమౌళిని రోడ్డు కాంట్రాక్టర్ అని పిలిచాడు. ఇంతకి అసలేం అయ్యిందంటే. సినిమా చూసిన ఆయన బాహుబలి: ది ఎపిక్ పై ఇలా రివ్యూ ఇచ్చారు. ‘ఒక రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు రాజమౌళినే‘ అంటూ ప్రశాంత్ వర్మ తన పోస్టులో రాసుకొచ్చారు.