BigTV English

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Telugu Film Industry: ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు చూస్తుంటే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నిజమే అనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎవరి కుప్పటి వారిదే అంటూ ఇటీవల ఓ ప్రెస్ మీట్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అంతేకాదు టాలీవుడ్ కి సంబంధించిన ఎప్పుడు ఏదోక అంశం బయటకు వస్తుంది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్స్, ఆడియో సంస్థ అధినేత వ్యవహారం టాలీవుడ్ హాట్ టాపిక మారింది. మొన్నటి వరకు ఒకరికి ఒకరు అన్నట్టు వీళ్లు ఇప్పుడు ఎడమోహం పెడమోహం ఉంటున్నారు. ఆ ఇద్దరు బడా నిర్మాతలతో కలిసి ఉన్న ప్రముఖ ఆడియో సంస్థ అధినేత వారు దూరం పెట్టడంతో ఒంటరయ్యాడు.


అయ్యే ఇలా అయిపోయాడంటే..

దీంతో ఆయన పరిస్థితి చూసి ఇండస్ట్రీ వర్గాలు అయ్యే అనుకుంటున్నాయి. నిజానికి ఈ ఆడియో సంస్థ మంచి పాపులారిటి సంపాదించుకుంది. ఒకప్పుడు బడా హీరోలు, నిర్మాతల సినిమాల ఆడియో రైట్స్ అన్ని ఈ సంస్థ చేతిలోనే ఉండేవి. అంతగా ఆ బడా నిర్మాతలు ఆ ఆడియో సంస్థ అధినేతకు సపోర్టుగా నిలిచారు. సపోర్టు అనేకంటే అండగా ఉన్నారు అని చెబితే సరిపోతుంది. తమ బ్యానర్ రిలీజైన సినిమాల ఆడియో రైట్స్ ఈ సంస్థలోనే రిలీజ్ అయ్యేవి. అంతగా ఆ అగ్ర నిర్మాతలకు ఆయనకు హెల్ప్ చేశారు. వార సపోర్టుతో ఇండస్ట్రీలో టాప్ లోకి వెళ్లాడు.

ఒకప్పుడు నానా హడావుడి చేసిన ఈ ఆడియో అధినేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడ కనిపించడం లేదు. తన ఆడియో సంస్థలో ఎలాంటి పాటలు రావడం లేదు. దీనికి కారణం ఆ నిర్మాతలతో ఆయనకు చెడడటమే అంటున్నారు. ఇటీవల అగ్ర నిర్మాత బ్యానర్ నుంచి ఓ పాన్ ఇండియా మూవీ రిలీజైంది. భారీ బడ్జెట్ పెట్టి ఆ చిత్రంతో ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ అవ్వాలని ఆశపడ్డాడు.కానీ, విడుదల తర్వాత అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. ఇండస్ట్రీ హిట్ కొడుతుందని ఆశ పడ్డ ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.


ఆ నిర్మాతలతో వివాదం..

ఆ సినిమా హీరో పాన్ ఇండియా స్టార్, ఒకప్పుడు ఇండస్ట్రీకీ ఎన్నో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు.. అయినా ఈ సినిమా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో ఓ పాటకే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టాడంటే అది ఎంతటి బడ్జెట్ మూవీనో అర్థం చేసుకోండి. భారీగా ఖర్చు పెట్టిన డైరెక్టర్.. భారీగా నష్టపోయాడు. ఆ తర్వాత మిడిల్ రేంజ్ హీరో ఓ సినిమా చేశాడు. కానీ, అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో వరుస ప్లాప్స్ తో నష్టపోయిన ఆ నిర్మాత ఐటీ రైడ్స్ షాకిచ్చాయి. అదే టైంలో ఆ ఆడియో సంస్థ అధినేతతో ఈ నిర్మాతకు చెడింది. అప్పటి వరకు ఎంతో సన్నిహితంగా ఉన్న వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయి.

ప్రస్తుతం వారు కనీసం మొహం కూడా చూసుకోవడం లేదు. ఇక మరో నిర్మాతతో కూడా అచ్చం ఇలాంటి మనస్పర్థలే వచ్చాయట. ఆయన బ్యానర్ లోనూ వచ్చిన సినిమాలు వరుసగా ప్లాప్స్ అయ్యాయి. అప్పటి వరకు ఈ సంస్థలో వచ్చిన సినిమా ఓటీటీ, ఆడియో, శాటిలైట్ రైట్స్ అన్ని ఈ ఆడియో సంస్థ అధినేత చూసుకునేవాడు. అంత సన్నిహితంగా ఉన్న వారి మధ్య ఇప్పుడు విశ్వమంత గ్యాప్ వచ్చిందట. ఈ ఇద్దరు నిర్మాతలు దూరం అవ్వడం ప్రస్తుతం ఆ ఆడియో సంస్థ అధినేత ఒంటరి వాడయ్యాడట. మొన్నటి వరుస సినిమాలు, పాటలు రిలీజ్ చేస్తూ.. టాప్ లో ఉన్న ఆయన ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూసి అయ్యే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు.. అయినా పరిస్థితులు, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అని మాట్లాడుకుంటున్నారు.

Related News

KishkindPuri event :బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆ ముగ్గురు దర్శకులు హాజరు

Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం పిల్లలతో కలిసి కరిష్మ బడా ప్లాన్.. రూ.30 వేల కోట్లంటే మాటలా?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

The Conjuring-Last Rites: హర్రర్ సీన్స్ వస్తుంటే జోకులు.. ‘కంజూరింగ్’ మూవీ థియేటర్‌లో కొట్టుకున్న జంటలు!

×