ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే వేతన జీవులు అప్పుడప్పుడు రిలాక్స్ అయ్యేందుకు టూర్లు ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది ఆలయాలు, టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్తే, మరికొంత మంది క్రేజీ ఎక్స్ పీరియెన్స్ కోసం ప్రయత్నిస్తారు. రొటీన్ కు భిన్నంగా ఉండాలనుకునే వారికి హైదరాబాద్ పరిసరాల్లోనే ఓ క్రేజీ పిక్నిక్ స్పాట్ ఉంది. ఇక్కడికి వెళ్తే బయటి ప్రపంచాన్ని పూర్తిగా మైమరిచి పోవాల్సిందే. ఇంతకీ ఆ స్పాట్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇప్పటి వరకు టూర్ లో భాగంగా చాలా మంది చాలా చోట్ల స్టే చేసి ఉంటారు. ప్రైవేట్ హోటల్స్, గవర్నమెంట్ హరిత రిసార్ట్స్ లాంటి ప్లేసెస్ లో ఉండి ఉంటారు. కానీ, ఇప్పుడు మనం తెలంగాణలోనే తొలి కార్వాన్ క్యాంపెయిన్ స్టే గురించి తెలుసుకుందాం.. ఇక్కడ ఒక రాత్రి మొత్తం స్టే చేయవచ్చు. ఇందు కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 2200 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కార్వాన్ స్టే మాత్రమే కాదు, టెంట్ క్యాంపెయిన్, డార్మెట్రీలు కూడా ఉంటాయి.
సాధారణంగా ఇక్కడ సాయంత్రం 4 గంటలకు చెకిన్ అయితే, మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ వరకు వీళ్లే అరేంజ్ చేస్తారు. ఇందులో ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్, క్యాంప్ పైర్ విత్ తంబోలా, పెయింటింగ్, పాటరీ, యూనిక్ యాక్టివిటీస్ తో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చెయ్యొచ్చు. డైనింగ్ ఏరియా, సౌండ్ సిస్టమ్ తో పాటు నేచర్ ను ఎంజాయ్ చేయడానికి పీస్ పుల్ సిట్టింగ్ ఏరియాలు ఉంటాయి. ప్రశాంతంగా పొలాల మధ్యతో గోశాలను కూడా ఎక్స్ పీరియెన్స్ చెయ్యొచ్చు. బర్త్ డే పార్టీలు లాంటి స్పెషల్ సెలబ్రేషన్స్ ను కూడా వీళ్లు ప్లాన్ చేస్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్ తో సహా అన్నీ ఏర్పాటు చేస్తారు. చక్కటి మామిడి తోట మధ్యలో ఇలాంటి కార్వాన్ క్యాంపెయిన్ స్టే ఓ యూనిక్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.
ఈ అద్భుతమైన ప్లేస్ పేరు ‘ది ఎర్త్ క్యాంపెయిన్’. షామీర్ పేట్ కు చాలా దగ్గరలో నారాయణపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ ప్లేస్ ను బుక్ చేసుకోవాలంట www.earthscamping.com కు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు, స్టేను బుక్ చేసుకోవద్దు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీరు స్టేను బుక్ చేసుకోండి. ప్రకృతి మధ్యలో ఎంజాయ్ చేయండి!
Read Also: బ్యాండ్ మేళాతో పిల్లల్ని నిద్రలేపిన తల్లి.. బద్దకానికి భలే ట్రీట్మెంట్!
Read Also: దేశంలో అత్యధిక అక్రమ సంబంధాలు పెట్టుకొనే నగరం అదేనట, మరి మన తెలుగు రాష్ట్రాల్లో?