Kiara – Siddharth: చిత్ర పరిశ్రమలో పేరు మోసిన ఎన్నో క్యూట్ జంటలు ఎప్పటికప్పుడు తమ బంధంతో ప్రేక్షకులకు అలరిస్తూనే ఉంటారు. అయితే అలాంటి క్యూట్ జంటలు అనూహ్యంగా విడిపోతే.. అభిమానులు తట్టుకుంటారా.. ? అయితే ఒక్కొక్కసారి విడిపోతున్నారు అనే వార్తలు కూడా రూమర్స్ గానే వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో క్యూట్ జోడీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక జంట అనూహ్యంగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ జంట ఎవరు ? ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
వారెవరో కాదు బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న జంటలలో ఒకటిగా పేరు సొంతం చేసుకున్న కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) జంట. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆకట్టుకునే ఈ జంట.. పెళ్లి తర్వాత ఏం చేసినా సరే ఇట్టే క్షణాలలో వైరల్ అవుతోంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయని.. అందుకే ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగిందని, చివరికి విడాకుల దిశగా వెళ్తున్నారు అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా యశ్ (yash)హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమా కారణంగానే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇందులో అసలు నిజం ఎంత? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. విషయంలోకి వెళ్తే.. కియారా అద్వానీ నటించిన టాక్సిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై గతంలో సామాజిక మాధ్యమాలలో కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు మొదలయ్యాయని, అందుకే సిద్ధార్థ్ ఆమెను దూరంగా ఉంచుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమెతో విడాకుల కోసం న్యాయస్థానాన్ని కూడా సిద్ధార్థ్ ఆశ్రయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ దీనిపై ఎటువంటి స్పష్టత లేదు..
also read:కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!
ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సినిమా కోసం నటీనటులు పోషించే పాత్రలను తెరపై కనిపించే సన్నివేశాలను వారి వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా ఉండడం గమనార్హం.సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను కేవలం ఊహాగానాలు లేదా పుకార్లు గానే చూడాల్సి ఉంటుంది.. ఎందుకంటే ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రముఖ జంటల విషయంలో చిన్న విషయాలు కూడా పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక ఫోటో లేదా ఒక కార్యక్రమానికి జంటగా హాజరు కాకపోవడం, సోషల్ మీడియాలో పోస్టుల మధ్య గ్యాప్ కూడా రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.. మరి ఈ జంట ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.