Maharashtra: బిచ్చగాడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో హీరో వేల కోట్లకు అధిపతి అయి కూడా తన తల్లి కోసం బిచ్చగాడిగా మారిపోతాడు. అదంతా రీల్.. రియల్ లైఫ్‌లో ఓ ఎమ్మెల్యే అలా మారిపోయాడు. వేల కోట్లకు అధిపతి, ఓ గురువు ఇచ్చిన సలహా మేరకు ఒక్కరోజు బిచ్చగాడిగా మారిపోయారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పరాగ్ షా. మాన్ ఇన్ఫ్రా కంపెనీ సీఈఓ కూడా. ఆయన ఆస్తి దాదాపు రూ. 3383 కోట్లు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం. కానీ ఆయనకు అవేమీ మనశ్శాంతిని ఇవ్వలేదు. రాష్ట్రంలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. భద్రతా సిబ్బంది, విలాసవంతమైన కార్లను పక్కన పెట్టేశారు. జీవిత వాస్తవికతను తెలుసుకోవాలన్న తన ఆధ్యాత్మిక జైన గురువు సలహా మేరకు ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు.
ఘాట్‌కోపర్ వీధుల్లో ఒక రోజంతా భిక్షగాడి వేషధారణలో గడిపారు.. జీవించారు. జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసం సందర్భంగా ముంబై ఘట్కోపర్ వీధుల్లో బిచ్చగాడి వేషంలో కూర్చొన్నారు ఎమ్మెల్యే పరాగ్ షా. మేకప్ వేసుకుని ప్రజలు గుర్తు పట్టకుండా జాగ్రత్తపడ్డారు. భుజాన ఓ సంచి వేసుకుని, చేతులో చీపురు పట్టుకుని కనిపించారు. రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ కనిపించారు. ఎండలో కూడా ఆయన తిరిగారు. చాలా తినుబండారాల షాపులకు వెళ్లి ధర్మం చేయాలని వేడుకున్నారు. తెచ్చినవి బిచ్చగాళ్లు కూర్చొన్న ప్రాంతంలో వాటిని ఆరగించారు.
ALSO READ: పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు
ఆ సమయంలో కొంతమందితో ఆయన మాట్లాడారు కూడా. ప్రజలను ఆహారం, డబ్బు అడిగారు కూడా. డబ్బులు లేవని చెప్పినందుకు ఓ సమోసా వ్యాపారి, అతని నుంచి డబ్బులు తీసుకోకుండానే చిరునవ్వుతో సమోసా ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత తన మేకప్ తొలగించి తాను తిరిగిన ప్రాంతానికి మళ్లీ వెళ్లి ప్రజల ప్రవర్తనను గమనించారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారని మనసులోని మాట బయపెట్టారు. జీవితంలో వాస్తవం అదేనని సదరు ఎమ్మెల్యే పరాగ్ షా చెప్పుకొచ్చారు.
करोड़ों की संपत्ति… फिर क्यों मांगी भीख? 😲
BJP विधायक Parag Shah भिखारी के वेश में मुंबई की सड़कों और रेलवे स्टेशन पर मदद मांगते नजर आए। #ParagShah #BJP #Mumbai #Ghatkopar #ViralVideo #Maharashtra #PoliticalNews #HindiNews pic.twitter.com/VXba6dhJnl— Rashtriya Prastavana (@rprastavana) September 15, 2026