Trophy chor Naqvi: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీ (Women’s Asia Cup 2026 Tournament) వివాదం మొహ్సిన్ నఖ్వీని వదలడం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ట్రోఫీ చోర్ అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. 2025 ట్రోఫీని దొంగిలించినట్లుగానే.. ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీని కూడా ఎత్తుకెళ్లాడని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ పోస్టులు చూస్తే.. నిజంగానే మొహ్సిన్ నఖ్వీ ఉరేసుకోవడం గ్యారెంటీ. అంత దారుణంగా ఇండియన్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. అయితే విజేతగా నిలిచిన టీమిండియా ఉమెన్స్ జట్టు..మొహ్సిన్ నఖ్వీని ఛీ కొట్టి.. ట్రోఫీ ని వద్దనుకుంది. ఈ క్రమంలో తన కారులోనే ట్రోఫీతో ఎస్కేప్ అయ్యాడు మొహ్సిన్ నఖ్వీ. దీంతో తిక్క రేగిన టీమిండియా అభిమానులు..వెంటనే దుబాయ్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లలో ఫిర్యాదు చేశారు. ఇండియన్ అభిమానుల ఫిర్యాదు నేపథ్యంలో.. చేసేదేమీ లేక కేసు కూడా దుబాయ్ పోలీసులు బుక్ చేసుకున్నారని సమాచారం. దర్యాప్తు చేస్తున్నామని కూడా సదరు పోలీసులు వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సంఘటన నేపథ్యంలో కొంత మంది మొహ్సిన్ నఖ్వీని దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా పోస్టులు వైరల్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దుబాయ్ లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో మొహ్సిన్ నఖ్వీని అరెస్టు చేశారని అంటున్నారు. అయితే మొహ్సిన్ నఖ్వీని అరెస్టు చేసిన సమయంలో అతడి దగ్గర ట్రోఫీ లేదని కూడా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఆసియా కప్ 2026 టోర్నమెంటు ట్రోఫీ చోర్ వివాదం నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ తప్పేం లేదని కొంత మంది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ హోదాలో ఉన్న మొహ్సిన్ నఖ్వీ మీదుగానే టీమిండియా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య గొడవ ఉన్న నేపథ్యంలో ట్రోఫీకి నిరాకరించింది టీమిండియా. ఇచ్చేందుకు మొహ్సిన్ నఖ్వీ సిద్ధంగా ఉన్నప్పటికీ… టీమిండియా వదులుకున్న నేపథ్యంలో వాళ్లది తప్పని అంటున్నారు. అయితే మరికొంతమంది టీం ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రోఫీ వద్దనుకుంటే అక్కడే వేరే అధికారి ద్వారా టీమిండియాకు అందించవచ్చు. కానీ అలా చేయకుండా తప్పులు ఇరుక్కున్నాడు మొహ్సిన్ నఖ్వీ. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.