Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 అలా ప్రారంభమైందో లేదో అప్పుడే మొదటి వారం ఇద్దరు కంటెస్టెంట్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట బయటకు వచ్చేశారు. ఇప్పుడు రెండవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరికొకరు కొట్టుకునేలా ప్రవర్తిస్తున్న తీరు కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మీరంతా మనుషులేనా అనే రేంజ్ లో ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో షాలిని (Shalini ), వర్షిణి (Varshini) ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లడం సంచలనంగా మారింది. ముఖ్యంగా వర్షిణి పై షాలిని కాస్త ఓవర్ చేసిందేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సోమవారం నామినేషన్ ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ మొత్తం త్రిగుణ్ ను టార్గెట్ చేసి నామినేట్ చేసినట్లుగా అనిపించింది. ఇక రెండవ ప్రోమోలో వర్షిణి, షాలిని ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు వెళ్లి కొట్టుకునేలా బిల్డప్ ఇవ్వడంతో మధ్యలో కామన్ కేటగిరిలో హౌస్ లోకి వచ్చిన సృష్టి వచ్చి వీరిద్దరి మధ్య గొడవలు దూరం చేసింది. టాస్క్ లో గెలిచిన నరేష్ (Naresh) నామినేషన్స్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక నరేష్ మాట్లాడుతూ.. షాలినినీ నామినేట్ చేస్తూ.. “ఆరోజు చైత్ర గారి పేరు రివీల్ అయిన తర్వాత మీరు సారీ చెప్పాల్సింది పోయి.. గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత చైత్ర గారే మీ వద్దకు వచ్చి సారీ చెప్పారు. ఇక మేమంతా కూర్చున్నాం.. మీరు మాత్రం ఒక ఐదు నిమిషాలు లేటుగా వస్తారు. లేట్ వస్తే డైరెక్ట్ నామినేషన్ అని బిగ్ బాస్ కూడా హెచ్చరించాడు” అని నరేష్ అంటే..” మరి మీ ఫ్రెండ్ రాంప్రసాద్ నిద్రపోతే ఎన్నిసార్లు కుక్కలు మొరిగాయి” అని షాలిని అంటుంది. ” ఆయన రూల్స్ బ్రేక్ చేశాడు.. నేను కూడా చేశాను అని షాలిని అంటుంది.
“ఇదే కుక్కలు అమన్ కి కూడా మొరిగాయి.. మరి అప్పుడు చెప్పే దమ్ము లేదా?” అని నరేష్ గట్టిగా అడిగాడు. ఇక నరేష్ అడిగిన పాయింట్ నచ్చడంతో త్రిగుణ్ చప్పట్లు కొడతాడు. దీనికి షాలిని ఎవరైనా నామినేషన్స్ పాయింట్లు మాట్లాడుతుంటే.. చప్పట్లు కొట్టి జనాలకు ఏదో పంపిస్తున్నారు. ఇక్కడ క్లియర్ ఫేవరిజం నడుస్తోందని, త్రిగుణ్ గురించి ఇన్ డైరెక్ట్ గా షాలిని అంటుంది. “మీరు కూడా కొట్టండి” అని త్రిగుణ్ అంటాడు. అలా కొట్టడం నాకు నచ్చలేదు అని షాలిని అంటే ..సృష్టి, రోహిత్ వంటి వారు చప్పట్లు కొడుతారు. మరి ఇప్పుడు నీకే వీళ్ళు ఇలా చప్పట్లు కొట్టి సపోర్ట్ చేశారు కదా అని రాంప్రసాద్ కూడా అంటారు. వేరే గ్రూపులు ఇక్కడ నడుస్తున్నాయి.. వాటిని బ్రేక్ చేయడానికి నా స్ట్రాటజీలు వాడుతున్నానని త్రిగుణ్ అంటే.. అగ్నిపరీక్ష అని తీసుకొచ్చింది మీరే అని రోహిత్ అంటాడు అవును ఈ పాయింట్ కి నేను కూడా అగ్రి చేస్తాను అని మధ్యలోకి దూరుతుంది షాలిని
ALSO READ:ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!
ఇక దీంతో వర్షిణి..” ఇప్పుడే కదండీ.. ఎవరు మాట్లాడొద్దు మధ్యలో అన్నారు.. అగ్రి అనడంలో ఏముంది ? చప్పట్లు కొట్టడంలో ఏముంది? అని వర్షిణి అంటుంది. ఇక దాంతో వర్షిణి, షాలిని మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. షాలిని మీద కొస్తుంటే.. వర్షిణి చేతులు వేసి ఆపే ప్రయత్నం చేసింది. గొడవను సృష్టి ఆపడానికి ప్రయత్నించారు . మరి వీరిద్దరి గొడవ ఎంతవరకు వెళ్తోంది అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే.