Manchu Vishnu : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చాలా సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ఆ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాల్లో మంచు విష్ణు నటించిన కన్నప్ప ఒకటి. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా మీద పెద్దపెద్ద స్టార్స్ నటించడంతో కొద్ది మేరకు అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇంతమంది పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న కూడా మంచు విష్ణు ఒక్కడే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
మంచు విష్ణు కార్యాలయం పై ఐటి రైడ్స్
కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తరుణంలో. మాదాపూర్ లోని మంచు విష్ణు కార్యాలయంపై ఐటి ,జిఎస్టి సోదాలు నిర్వహించింది. కన్నప్ప సినిమాకు అయిన బడ్జెట్ వివరాలు పై జిఎస్టి అధికారులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు టాక్స్ ,జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రిలీజ్ కు రెండు రోజులకు ముందే ఇలా జరగడం అనేది షాకింగ్ విషయం. ఇక దీనిపై మంచు విష్ణు టీం రెస్పాండ్ అయింది. అవి ఐటీ దాడులు కాదు… అకౌంట్ లెక్కల ప్రకారం జీఎస్‌టీ కట్టారా, లేదా? అనే విషయాన్ని జీఎస్‌టీ అధికారులు ఆరా తీస్తున్నారంతే. అంటూ తెలిపారు.మరోవైపు సినిమాకి కూడా పెద్దగా బజ్ లేకుండా పోయింది.
Also Read: Mahesh Babu: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్, మహేష్ బాబు పై ట్రోలింగ్