BigTV English

Mahesh Babu: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్, మహేష్ బాబు పై ట్రోలింగ్

Mahesh Babu: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్, మహేష్ బాబు పై ట్రోలింగ్

Mahesh Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు తన కెరీర్ లో పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఆ కాంబినేషన్ అలాంటిది. అయితే గతంలో చాలాసార్లు బాలీవుడ్ లో మీరు సినిమాలు చేస్తారా అని మహేష్ బాబుని అడిగినప్పుడు. ముందు తెలుగులోని కానివ్వండి అంటూ మాట్లాడుతూ వచ్చారు. మొత్తానికి రాజమౌళి వలన పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాల్సి వస్తుంది.


తెలుగులో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ 

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కానీ సరైన పోటీ మాత్రం పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అభిమానులకు ఉండేది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సినిమాలు మీద ఉన్న ఆసక్తి పూర్తిస్థాయిలో తగ్గిపోయింది. రాజకీయాల్లో సక్సెస్ అవ్వటం వలన సినిమాలను పక్కన పెట్టేశారు. నేడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు దొరకని పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసి ఉంటే ఈపాటికి రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమా క్రేజ్ విపరీతంగా ఉండేది. దానికి తోడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయటం వలన, మిగతా పనులు రాజమౌళి బిజీగా ఉండటం వలన మహేష్ బాబు వరుసగా సినిమాలు చూడటం మొదలుపెట్టారు.


యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్ అన్న

ఇక రీసెంట్ గా సుమంత్ నటించిన అనగనగా అనే సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్స్ లో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా రీల్స్ కనిపిస్తూ వచ్చాయి. అందరూ కూడా సుమంత్ ని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తానికి ఈ సినిమా చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీనితో మహేష్ బాబు అభిమానులంతా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రివ్యూ చెప్పు అన్నా అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ ఇలా ఒక సినిమా గురించి చెప్పడం మొదటి సారి కాదు. గతంలో కూడా మేము ఫేమస్ అనే సినిమా గురించి చెప్పినప్పుడు చాలామంది మహేష్ ను ట్రోల్ చేశారు. ఆ ట్వీట్ కూడా మహేష్ బాబు వేయలేదు ఎవరు హ్యాండిల్స్ వేశారు అంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కొంతమంది మహేష్ బాబు ని ట్రోలింగ్ చేస్తే, మరి కొంతమంది టాలెంట్ ను ఇలానే ఎంకరేజ్ చెయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది రాజమౌళి షూటింగ్ బంకు కొట్టి సినిమాలు చూస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×