E-Paper
Advertisement

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!
Advertisement

S.Janaki: గాన కోకిల.. భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తన అద్భుత స్వరంతో సుమారుగా 60 సంవత్సరాల పాటు సాగిన ఎస్. జానకి ఇక లేరు అన్న వార్తను సంగీత అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేలాది మధుర గీతాలతో తరతరాల శ్రోతలను ఓలలాడించిన జానకమ్మ.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాటలు మాత్రం విశ్వం ఉన్నంత వరకు అమరంగానే నిలిచిపోతాయి. గత ఆరు నెలల క్రితమే కొడుకును కోల్పోయిన జానకమ్మ.. 2026 జూలై 11వ తేదీన వయోభార రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో మైసూర్ లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

జానకమ్మ అంత్యక్రియలు నేడే..

ఆమె మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జానకమ్మ అంత్యక్రియలు నేడు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం జానకమ్మ చివరి కోరిక మేరకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండీ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

అభిమానుల సందర్శనార్థం..

Advertisement

ఇక ప్రజల సందర్శనార్థం జానకమ్మ పార్థివ దేహాన్ని ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూర్ లోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచనున్నారు. ఆ తర్వాత అధికారిక గౌరవాలతో అంతిమయాత్ర నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల మధ్య జానకమ్మకు అంత్యక్రియలు జరపనున్నారు. సుమారుగా ఆరు దశాబ్దాల కాలంలో 17కు పైగా భాషలలో 50వేలకి పైగా పాటలకు తన అద్భుతమైన గాత్రాన్ని అందించిన జానకమ్మకు అభిమానులు, సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగవ సంతానం.

వృత్తిపరంగా ఉన్నత శిఖరానికి ఎగిసిన జానకమ్మ.. వ్యక్తిగతంగా మాత్రం తీరని దుఃఖాన్ని అనుభవించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలంలో పల్లపట్లలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు కాగా.. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఈమె నాలుగవ సంతానం. చదువంటే ఇష్టం లేని జానకి రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం చేసేవారట. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. ఆ తర్వాత రాజమండ్రిలో జీవించారు.

వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జానకి..

Advertisement

కూతురికి పాటలపై ఉన్న ఆసక్తిని గమనించిన జానకి తల్లి సత్యవతి రాజమండ్రిలో ఉన్న నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించినా.. ఆమెకు మాత్రం ప్రత్యేకంగా సినిమా పాటలంటేనే ఎక్కువ ఇష్టపడేవారట.. ఇక శాస్త్రీయ సంగీతంలో ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా ఆమె మంచి పేరు మాత్రం దక్కించుకున్నారు. ఇక 1959లో రాంప్రసాద్ తో ఆమెకు వివాహం జరిగింది. జానకమ్మకు సంబంధించిన రెమ్యునరేషన్, పాటల ఒప్పందాలు , రాయల్టీలు అన్ని రాంప్రసాద్ స్వయంగా చూసుకునేవారు. వీరికి ఒకే ఒక్క సంతానం మురళీకృష్ణ. కోడలు ఉమా..( నర్తకి). 1997లో భర్త మృతి చెందగా.. ఈ ఏడాది జనవరిలో ఒక్కగానొక్క కుమారుడు మురళీకృష్ణ కూడా మరణించారు. ఇక సరిగ్గా కొడుకు చనిపోయిన ఆరు నెలలకే జానకమ్మ కూడా మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

also raed: లెజెండ్రీ సింగర్ జానకమ్మ చివరి వీడియో ఇదే!

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×