E-Paper
Advertisement

లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!

లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!
Advertisement

S.Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక బంగారు అధ్యాయం ముగిసింది. గత కొన్ని దశాబ్దాలుగా తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన “దక్షిణ భారత కోకిల” లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి 88 సంవత్సరాల వయసులో శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూ పలు అనారోగ్య సమస్యలతో మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈమె.. సడన్గా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఈ మరణ వార్త యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.. భారతీయ చిత్ర సీమ అందులోనూ దక్షణాది సినీ పరిశ్రమ ఒక కన్నతల్లిని కోల్పోయినంతగా శోకసంద్రంలో మునిగిపోయింది.

జానకి మరణంపై సెలబ్రిటీలు సంతాపం..

జానకమ్మ మరణాన్ని సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రగాఢ సానుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు దిగ్గజ సీనియర్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎస్ జానకి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

Advertisement

also read:కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?

జానకి మృతిపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి జానకమ్మతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ఫోటో రూపంలో పంచుకుంటూ.. ఈ విధంగా ఆమె మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. “జానకమ్మ గారి మరణ వార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరియర్ లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తించుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారి ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు.. మళ్లీ కళ్ళ ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు.. భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం.. ఒక అనుభూతి.. ఒక జీవిత కాలపు అనుబంధం. ఈరోజు మనం సంగీత ప్రపంచంలోని ఒక మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం.. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. శ్రీమతి ఎస్ జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జానకమ్మ గారు..మీ స్వరం ఎప్పటికీ అమరం.. ఓం శాంతి” అంటూ నమస్కరిస్తున్న ఏమోజీని షేర్ చేస్తూ జానకి మృతి పట్ల భావోద్వేగం వ్యక్తం చేశారు చిరంజీవి.

Advertisement

జానకమ్మ మృతిపై బాలకృష్ణ భావోద్వేగం..

ఎస్.జానకమ్మ మృతిపై సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ కూడా ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. “గాన కోకిల లెజెండ్రీ సింగర్ శ్రీమతి ఎస్ జానకి అమ్మగారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరు అనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి రామారావు గారి చిత్రాలతో పాటు నా చిత్రాలలో కూడా ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాధరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అంటూ బాలకృష్ణ పోస్ట్ చేశారు. ఇక వీరితోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా జానకమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

https://www.facebook.com/share/1EwiE28sPr/

 

Related News

లెజెండ్రీ సింగర్ జానకమ్మ చివరి వీడియో ఇదే!

కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?

దయనీయస్థితిలో పావలా శ్యామల.. గుర్తుపట్టలేని విధంగా!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత!

తెలుగు తెరపై తొలి CGI మాయాజాలం ఏ సినిమాతో మొదలైందో తెలుసా?

సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?

Big Stories

Advertisement
×