E-Paper
Advertisement

దయనీయస్థితిలో పావలా శ్యామల.. గుర్తుపట్టలేని విధంగా!

దయనీయస్థితిలో పావలా శ్యామల.. గుర్తుపట్టలేని విధంగా!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలని చూస్తారు. అయితే కొంతమంది మాత్రం సినిమాల ద్వారా వచ్చిన డబ్బును యధేచ్చగా వృధా చేసి ఆఖరి నిమిషంలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అలాంటి వారిలో ప్రథమంగా వినిపించే పేరు మహానటి సావిత్రి.. రాజ భోగాలు అనుభవించిన ఆమె చివరికి అనాధలా మరణించడం అందరినీ కలిచి వేసింది. అడిగిన వారికి లేదనకుండా పెట్టిన అన్నపూర్ణ ఆమె.. అలాంటి ఆమెకే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం ఇండస్ట్రీలో ఎవరు జీర్ణించుకోలేకపోయారు.

గుర్తుపట్టలేని స్థితిలో నటి పావలా శ్యామల..

అలా ఎంతోమంది సెలబ్రిటీలు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కూడా ఒకరు. ఒకప్పుడు వెండితెరపై తనదైన నటనతో , హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈమె జీవితం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు తీవ్ర అనారోగ్యం, ఆదరణ కరువై అనాధగా మారడం సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది.

Advertisement

also read:టాలీవుడ్ బ్యూటీకి ఎండోమెట్రియోసిస్.. డాక్టర్ వింత సలహా!

అనాధాశ్రమానికి తరలించిన పోలీసులు..

ఇప్పటికే ఎన్నోసార్లు అనాధగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈమె.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో తన కుమార్తె మాధవితో కనిపించింది. అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీరిని వదిలి వెళ్లారు. అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్లగా.. సూపరిండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు వైద్యులు వారికి క్షయ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది. ఇతర తీవ్రమైన శారీరక ఇబ్బందులు ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా తరలించగా.. అక్కడ ఉండలేక వారు సాయంత్రానికి మళ్ళీ ఛాతీ ఆసుపత్రికి తిరిగివచ్చారు. ఇక దీంతో వెంటనే స్పందించిన ఆస్పత్రి వర్గాలు బోరుబండ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శుక్రవారం రోజు పోలీసులు ప్రత్యేక రక్షణ నడుమ వీరిద్దరిని నగరంలోని ఒక సురక్షితమైన అనాధాశ్రమానికి తరలించినట్లు సమాచారం.

దిక్కుతోచని స్థితిలో పావలా శ్యామల..

Advertisement

ఇకపోతే ఈ ఘటన కంటే ముందే ఈమె జీవితం మరింత అల్లకల్లోలంగా మారింది. గతంలో చికిత్స నిమిత్తం ఒక హాస్పటల్ కి వెళ్ళగా.. అక్కడ వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆమె వెను తిరగాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఒక కారు డ్రైవర్ ఆమెను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డుపై అనాధగా మిగిలిన ఆమెను కొందరు స్థానికులు గుర్తించి ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ఒక స్టార్ నటి దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

సరైన ప్రణాళిక లేకపోవడమే కారణమా?

నిజానికి పావలా శ్యామల కెరియర్ ఇలా దీనస్థితిలో ఉండడానికి కారణం భవిష్యత్తు అవసరాల కోసం ఆమె సరైన రీతిలో డబ్బును పొదుపు చేయలేకపోవడమే.. సినిమా రంగం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని, ఆ డబ్బును దాచుకోవడమే నేర్చుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవడం, భవిష్యత్తు భద్రతపై దృష్టి పెట్టి ఉంటే నేడు పావలా శ్యామలకు ఈ దీనస్థితి వచ్చేది కాదు అని పలువురు నిపుణులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!

కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత!

తెలుగు తెరపై తొలి CGI మాయాజాలం ఏ సినిమాతో మొదలైందో తెలుసా?

సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?

బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

Big Stories

Advertisement
×