E-Paper
Advertisement

15 నిమిషాల ఓవర్‌ టైమ్‌ కూ జీతం.. ఆ దేశంలో జాబ్ ఇంత బాగుంటుందా?

15 నిమిషాల ఓవర్‌ టైమ్‌ కూ జీతం.. ఆ దేశంలో జాబ్ ఇంత బాగుంటుందా?
Advertisement

Unique Work Culture:  వర్క్ ప్లేస్ లో ఎంత ఫ్రీడమ్ ఉంటే.. ఉద్యోగులు అంత చక్కగా పని చేస్తారని చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్. ఆ దేశంలో ఉద్యోగం అంటే, మంచి జీతం రావడం ఒక్కటే కాదు. అక్కడి వర్క్ కల్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కాదు, గడిచిన 10 ఏళ్లుగా అక్కడ జాబ్ చేస్తున్న ఓ భారతీయుడు చెప్పిన నిజం. గత పదేళ్లుగా అంకిత్ పురోహిత్ జపాన్ లో ఉద్యోగం చేస్తున్నారు. తాజాగా ఆయన తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

అంకిత్ పురోహిత్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన వీడియోలో..  ఆయన జపాన్ ఆఫీస్ లలో పాటించే కొన్ని స్పెషల్ రూల్స్, ఉద్యోగుల పట్ల చూపే గౌరవం, క్రమశిక్షణ గురించి వివరించారు. అక్కడ ఉద్యోగం చేయడం అంటే కేవలం పనులు పూర్తి చేయడం మాత్రమే కాదని,  అద్భుతమైన గౌరవం లభిస్తుందన్నారు. జపాన్‌ లో టైమెంటెనెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆఫీస్ ఉంటే, 9 గంటలకు కాదు.. అంతకంటే ముందే ఆఫీస్ కు చేరుకుంటారు. లేట్ గా రావడాన్ని అక్కడ ఇష్టపడరు.

Advertisement

ఆయన చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కంపెనీలో సీఈఓ అయినా, సాధారణ ఉద్యోగి అయినా ప్రయాణంలో పెద్దగా తేడా ఉండదు. చాలామంది పబ్లిక్ ట్రాన్స్ పోర్టునే ఉపయోగిస్తారు. రైల్లో ఆఫీస్ కు వెళ్లడం అక్కడ సాధారణ విషయం. ఎవరు ఏ వాహనంలో వచ్చారన్న దానికంటే, సమయానికి వచ్చారా? లేదా? అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వివరించారు.

భోజన విరామాన్ని కూడా అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత సమయంగా గౌరవిస్తారు. సాధారణంగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో పని గురించి ఎవరూ ఇబ్బంది పెట్టరని అంకిత్ పురోహిత్ తెలిపారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి భోజనం తీసుకురాకుండా, సమీపంలోని కన్వీనియన్స్ స్టోర్లలో దొరికే బెంటో మీల్స్‌ ను కొనుగోలు చేసి తింటారని చెప్పారు.

 15 నిమిషాలు ఎక్కువ పని చేసినా అదనపు సాలరీ

Advertisement

జపాన్ లో పని, జీతం మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ఒక ఉద్యోగి కేవలం 15 నిమిషాలు అదనంగా పనిచేసినా దానికి కూడా ఓవర్‌ టైమ్ చెల్లిస్తారని చెప్పారు. పని ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో అవసరం లేకుండా ఉద్యోగులను పని కోసం ఇబ్బంది పెట్టే అలవాటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. జపాన్‌లో వ్యక్తిగత విజయాల కంటే టీమ్ గా పని చేయడానికే ఎక్కువ విలువ ఉంటుంది. వేగంగా పని చేయడం కంటే నాణ్యతతో పని పూర్తి చేయడంపైనే సంస్థలు దృష్టి పెడతాయి. ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎదగాలని కంపెనీలు ప్రోత్సహిస్తాయని అంకిత్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు జపాన్ ఉద్యోగ కల్చర్ ను అభినందిస్తున్నారు.

Read Also: ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్ పోర్టులు ఇవే.. టాప్ 10లో 9 ఐరోపా దేశాలే, మరి ఇండియా?

Related News

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఇండియన్ రైల్వేలో రారాజు.. ఈ ట్రైన్ వస్తే మిగతావన్నీ పక్కకు వెళ్లాల్సిందే!

అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?

బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!

మాజీ ప్రేమికులు కలిసే స్పెషల్ మార్కెట్.. భార్యలే ‘వెళ్లి రా’ అంటారట!

Big Stories

Advertisement
×