E-Paper
Advertisement

పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!

పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!
Advertisement

S. Janaki: ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 17కు పైగా భాషలలో 50 వేలకు పైగా పాటలను తన అద్భుతమైన స్వరంతో ఆలపించి శ్రోతలను ఆలపించారు జానకమ్మ. దక్షిణాది గాన కోకిలగా పేరు ఘడించిన ఈమె శనివారం రాత్రి 7:30 గంటలకు మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు.. అయితే ఆ సమయంలో వృద్ధాప్య సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు బహుళ అవయవ వైఫల్యంతో ఆమె గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఇక ఈ ఏడాది.. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి నిరాశ్రయరాలైన జానకమ్మ.. కోడలు ఉమా, మనవరాలు అప్సరతో జీవనం సాగిస్తూ వచ్చారు. అయితే ఆ ఇంటికి ఉన్న ఈ ఒక్కగానొక్క పెద్ద దిక్కు కూడా మరణించడంతో జానకమ్మ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ఈ బాధను తట్టుకుంటూ తన నానమ్మ మరణాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు అప్సర వైద్యుల.

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు..

పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు, రాజకీయ ప్రముఖులు జానకమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నేడు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లో సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక అభిమానుల సందర్శనార్థం ఆమె పార్తివదేహాన్ని మైసూర్ లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఇక సాయంత్రం నాలుగు గంటల అనంతరం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

జానకమ్మ మృతితో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించడం మొదలుకొని.. ఆమె ఆస్తుల వరకు అన్నీ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ..కారణం?

జానకమ్మ కేవలం ఒక అసాధారణ గాయని మాత్రమే కాదు.. అంతకుమించి ఉన్నతమైన ఆత్మ గౌరవం, వ్యక్తిత్వం కలిగిన గొప్ప కళాకారిణి అని నిరూపించే ఒక చారిత్రాత్మక సంఘటనను సినీ విశ్లేషకులు , అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ ను జానకమ్మ నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించిన సమయంలో జానకి కేరళలోని ఒక వివాహ వేడుకలో ఉన్నారు.

ఆ సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించలేదా?

Advertisement

పురస్కార ప్రకటన వెలువడగానే ఆమె కుమారుడు మురళీకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణం దేశ అత్యున్నత ప్రతిష్టాత్మక అవార్డును ఇస్తున్నప్పుడు ముందస్తు సమాచారాన్ని కళాకారులకు లేదా వారి కుటుంబానికి అందించే కనీస సంప్రదాయాన్ని కూడా నాడు కేంద్రం పాటించలేదు. ఇక తమకు కూడా మీడియా ద్వారానే ఆ విషయం తెలిసిందని.. ఎప్పుడో పాతికేళ్ల క్రితం దక్కాల్సిన ఆ గౌరవం ఇంత ఆలస్యంగా ఇచ్చినందుకు వద్దనుకోవాలనుకున్న తన తల్లి నిర్ణయానికి కుటుంబం పూర్తి మద్దతుగా నిలిచిందని సమాచారం. ఏది ఏమైనా మీడియా ప్రకటన చూసే తనకు అవార్డు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడం ఆమెకు బాధ కలిగించిందని అందుకే , ఆ అవార్డును జానకమ్మ తిరస్కరించారని సమాచారం.

జానకమ్మ ఆస్తుల వివరాలు..

జానకమ్మ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. అప్పట్లోనే లక్షల్లో పారితోషకం తీసుకునే ఈమె.. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సింగర్ గా పేరు గడిచింది. సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. జానకి ఆస్తులు విలువ సుమారుగా రూ.537 కోట్లు ఉంటుందని అంచనా.. ఈమె ఆస్తులు ఎక్కువగా చెన్నైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా పాటల ద్వారా సంపాదించిన డబ్బులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే చెన్నైలో ప్రధాన ప్రాంతాలలో ఈమె కొనుగోలు చేసిన భూములు, భవనాల విలువ ఇప్పుడు వందల కోట్లకు చేరుకుందని సమాచారం.

 

also read: ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!

Related News

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!

Kollywood : రూ. 1.80 కోట్ల బకాయిల వివాదం.. స్టార్ హీరో పై చీటింగ్ కేసు నమోదు..

బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న పచ్చళ్ళ పాప.. బాపురే కుర్రాళ్లకు కష్టమే..!

లెజెండ్రీ సింగర్ జానకమ్మ చివరి వీడియో ఇదే!

లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!

కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?

దయనీయస్థితిలో పావలా శ్యామల.. గుర్తుపట్టలేని విధంగా!

Big Stories

Advertisement
×