Mohammad Kaif On Vaibhav: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన టి20 సిరీస్ ముగిసింది. ఈ టి20 సిరీస్ 4-0 తేడాతో ఇంగ్లాండు కైవసం చేసుకుంది. దీంతో ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చెప్పినట్లుగానే ఇంగ్లాండ్ చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయింది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య నిన్న జరిగిన ఐదవ టి20 సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని గౌతమ్ గంభీర్ పక్కకు పెట్టారు. టాస్ సమయం వరకు అతడు ఆడతాడని వార్తలు వచ్చినప్పటికీ.. సడన్ గా తప్పించారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SOORYAVANSHI) కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే దీనిపై మహమ్మద్ కైఫ్ రియాక్ట్ అయ్యారు. నువ్వు ఏం పీకావని ఏడుస్తున్నావ్… మూడు సార్లు అవకాశాలు ఇస్తే, సద్వినియోగం చేసుకోలేకపోయావు ? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏడిస్తే ఎలాంటి లాభం ఉండబోదని ఫైర్ అయ్యారు. దీంతో వైభవ్ పై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న చిట్టచివరి మ్యాచ్ జరిగింది. అంతకుముందు మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ… చివరి మ్యాచ్ లో మాత్రం ఆడలేదు. అతని స్థానంలో మళ్లీ సంజు శాంసన్ ను గంభీర్ తీసుకువచ్చారు. అయితే సడన్ గా వైభవ్ సూర్య వంశీని తప్పించిన నేపథ్యంలో అందరూ షాక్ అయ్యారు. అటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కూడా సింగిల్ గా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియో బయటకు వచ్చింది. తనకు చెప్పకుండానే తొలగించారని.. టాస్ వేసిన తర్వాత ఈ విషయాన్ని వైభవ్ కు చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ బుడ్డోడు ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చివరి మ్యాచ్ లో ఆడకుండా.. కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ రియాక్ట్ అయ్యారు. మూడు మ్యాచ్ లలో అవకాశం ఇచ్చిన గంభీర్.. చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇస్తే బాగుండని తెలిపారు. నిన్నటి మ్యాచ్ లో ఆడి ఉంటే అతనికి అనుభవం వచ్చేదన్నారు. అయితే చాన్స్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటే ఏం రాదని ఫైర్ అయ్యారు. ఇచ్చిన మూడు అవకాశాలను అనవసరంగా చేజార్చుకున్నాడని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఏడ్చి, గీ పెట్టినా ఇలాంటి ప్రయోజనం ఉండబోదని సంచలన వ్యాఖ్యలు చేశారు.