Tanveer Ahmed: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England ) మధ్య జరిగిన టి20 సిరీస్ నిన్నటితో ఫినిష్ అయింది. ఈ సిరీస్ ను 4-0 తేడాతో గెలుచుకున్న ఇంగ్లాండ్, టీమిండియాను వైట్ వాష్ చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీమిండియా ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే సీన్ రిపీట్ చేసింది. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగానే టీమ్ ఇండియాకు ఈ పరిస్థితి నెలకొందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాజీలు కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా ప్రదర్శనపై మాజీ పాకిస్తాన్ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో హీరోలుగా ఉన్న టీమిండియా ప్లేయర్లు… ఇప్పుడు జీరోలుగా మారారని హేళన చేశారు. ఇక్కడ 250 కి పైగా పరుగులు చేసిన టీమిండియా… ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో మాత్రం 150 పరుగులు కూడా కొట్టలేక చతికిల పడిందని విమర్శలు చేశారు. ఇండియాలో తప్ప.. విదేశీ గంటలపై వీళ్లకు ఆడటం చేతకాదని హేళన చేశారు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed).
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో మనోళ్లు చిత్తుగా ఓడారు. అటు ఐర్లాండ్ సిరీస్ లో కూడా ఓడిపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లపై తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తాగిన రెండు నెలల పాటు టీమిండియా ప్లేయర్లు హీరోలుగా కనిపించారని.. ఇప్పుడు జీరోలయ్యారు అంటూ పరువు తీశారు. హైవే లాంటి మైదానాలలో మాత్రమే వీళ్లకు ఆడటం చేతనవుతుందని.. విదేశీ గడ్డలపై మాత్రం తేలిపోతారని సెటైర్లు పేల్చాడు. దానికి నిదర్శనమే ఐర్లాండ్ లాగే ఇంగ్లాండ్ టూర్లు అంటూ వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ టోర్నమెంట్లో బౌండరీ గేట్లు 30 మీటర్ల నుంచి 40 మీటర్ల మధ్య ఉండేవని… ఈ క్రమంలో 250 నుంచి 290 పరుగుల వరకు ఇండియన్ క్రికెటర్లు సాధించారని తెలిపారు. అలాంటి ప్లేయర్ల రంగు విదేశీ మైదానాలలో బయటపడిందని చురకలు అంటించారు. ఇలాగే టీమిండియా ప్రదర్శన కనబరిస్తే… పాకిస్తాన్ చేతిలో కూడా చిత్తుగా ఓడుతుందన్నారు. వచ్చే ఏషియన్ గేమ్స్, ఆసియా కప్ 2027, వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లలో కూడా టీమిండియాను కచ్చితంగా చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. అలా ఊడించకపోతే పాకిస్తాన్ వీధులలో బట్టలు లేకుండా తిరుగుతానని కూడా శపథం చేశారు.