Samantha’s Ma Inti Bangaram: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే ఒక అధ్బుతం చేస్తుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇపుడు థియేట్రికల్ రన్‌లో సరికొత్త రికార్డులను లిఖిస్తోంది. సాధారణంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యే బాక్సాఫీస్ రికార్డులని లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ సాధించి చూపించడం ట్రేడ్ వర్గాలకి పెద్ద షాక్ ఇస్తుంది . గతంలో సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరిఎంటేడ్ ఓపెనింగ్స్‌ను చాలా ఈజీగా అధిగమించిన ‘మా ఇంటి బంగారం’, ప్రస్తుతం లాంగ్ రన్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ వైపు అడుగులు వేస్తోంది.
ఈ సినిమా సాధిస్తున్న ఈ సాలిడ్ వసూళ్లకు ప్రధాన కారణం కేవలం వీకెండ్స్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్లలో కనిపిస్తోన్న హౌస్‌ఫుల్ బోర్డులే. ముఖ్యంగా డిజిటల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్లాట్‌ఫార్మ్స్ అయిన బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ (District) యాప్‌లలో ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.
Also read :ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం.. జ్యోతిష్యుడి మాట నిజమైందా?
ఈ రెండు ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 17 లక్షలకు పైగా డిజిటల్ టికెట్లు అమ్ముడవడం ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్‌గా నిలిచింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయిలో గంట గంటకూ వేల సంఖ్యలో టికెట్లు బుక్ అవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకోవాలి. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా బుకింగ్స్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోవడం సమంత స్టార్ పవర్‌కు నిదర్శనం.
దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించగా, ఈసారి ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ఆ మ్యాజిక్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన లవ్ మరియు హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు సమంత క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసిన విధానం థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. సాంప్రదాయమైన చీరకట్టులో సమంత చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంటే, సెంటిమెంట్ సీన్స్ మహిళా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా సమంత వన్-వుమెన్ షోగా బాక్సాఫీస్ వద్ద చేస్తోన్న ఈ సాలిడ్ రన్, భవిష్యత్తులో రాబోయే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లకు ఒక పెద్ద బెంచ్‌మార్క్‌గా మారనుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘మా ఇంటి బంగారం’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ చిత్రం సాధిస్తున్న విపరీతమైన మౌత్ టాక్ కారణంగా రాబోయే రోజుల్లో థియేటర్ల సంఖ్య మరియు స్క్రీన్ల కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ ‘బంగారం’ భారీ వసూళ్లను సాధిస్తూ సమంత గ్లోబల్ మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించింది.
Also read :చిన్న వయసులోనే ఫిలింఫేర్ రికార్డ్.. మూడు సిల్వర్ జూబ్లీల హ్యాట్రిక్.. అదీ ఉదయ్ కిరణ్ రేంజ్
రాబోయే వారాల్లో పెద్ద చిత్రాల పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మరింత కలిసిరానుంది. మొత్తానికి ట్రేడ్ అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డుల వేటను కొనసాగిస్తున్న ఈ చిత్రం, లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎన్ని చారిత్రాత్మక రికార్డులను బద్దలు కొడుతుందో మరియు సమంత కెరీర్‌లోనే ఎలాంటి బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందో చూడాలి.