E-Paper
Advertisement

‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!
Advertisement

Mahesh Video: బుల్లితెర మోస్ట్ పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తనదైన టైమింగ్, యాసతో ఫేమస్ అయిన నటుడు మహేశ్ అలియాస్ మహేశ్ ఆచంట సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక లేటెస్ట్ వీడియో ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ స్టేజ్ ఇచ్చిన గుర్తింపుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘రంగస్థలం’ (2018)లో స్నేహితుడిగా అద్భుతమైన నటన కనబరిచాడు. ఆ తర్వాత కీర్తి సురేశ్  ‘మహానటి’ (2018) చిత్రంలోనూ ఒక కీలకమైన పాత్రలో మెప్పించి నటుడిగా తన రేంజ్‌ను పెంచుకున్నాడు. రీసెంట్‌గా 2026 మే నెలలో విడుదలైన ‘సింగ్ గీతం’లోనూ ఒక వైవిధ్యమైన పాత్రతో అలరించిన మహేశ్, తాజాగా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు 

ఆ వీడియోలో మహేశ్ మాట్లాడుతూ.. లైఫ్ అనేది చాలా అన్‌ప్రెడిక్టబుల్ అని, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరని చాలా సీరియస్‌గా చెప్పుకొచ్చాడు. మనం బయట చూసే విషయాలను బట్టి ఏవేవో కల్పితాలు అల్లేసి, దాన్నే నిజమని నమ్మేయడం అస్సలు కరెక్ట్ కాదని హితవు పలికాడు. ముఖ్యంగా మీడియా రిపోర్టర్స్, యూట్యూబ్  క్రియేటర్స్, అలాగే సోషల్ మీడియా మీమర్స్ తాను స్వయంగా వచ్చి అసలు నిజం చెప్పేంతవరకు ఎలాంటి ఊహాగానాలు రాయొద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని దాదాపు చేతులు జోడించి రిక్వెస్ట్ చేశాడు. త్వరలోనే తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడిస్తానని, అంతవరకు ఎవరూ తొందరపడి థంబ్ నైల్స్ పెట్టవద్దని కోరడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వెబ్ సిరీస్ ప్రమోషనల్ క్యాంపెయిన్?

Advertisement

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ విశ్లేషకులు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. నిజంగానే మహేశ్ వ్యక్తిగత జీవితంలో లేదా కెరీర్‌లో ఏదైనా సీరియస్ సమస్య ఎదురైందా అనే కోణంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మెజారిటీ జనాలు మాత్రం ఇదంతా పక్కా పబ్లిసిటీ స్టంట్ అయి ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు.

Also read :సుకుమార్ సినిమాలో చేయాలంటే ఈ హీరోయిన్ ఎన్ని కండీషన్స్ పెట్టిందో తెలుసా ?

Advertisement

ఎందుకంటే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి ‘ప్రాంక్ ప్రమోషన్స్’ చాలా ఎక్కువైపోయాయి. సినిమా ప్రమోషన్ల కోసం, లేదా ఓటీటీ ప్రాజెక్టుల హైప్ కోసం సెలబ్రిటీలు సడన్‌గా కెమెరా ముందుకు వచ్చి ఏడుస్తూ వీడియోలు పెట్టడం, విడాకులు తీసుకుంటున్నట్లు హింట్లు ఇవ్వడం, లేదంటే ప్రమాదం జరిగిందంటూ హంగామా సృష్టించడం సర్వసాధారణమైపోయింది. తీరా కట్ చేస్తే.. ఒక రెండు రోజుల తర్వాత అదంతా ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషనల్ క్యాంపెయిన్ అని తేలడంతో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారు.

స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే

ఇటీవలే ప్రముఖ సింగర్ సునీత కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమాజంలో వ్యూస్ కోసం ఎలాంటి తప్పుడు వార్తలనైనా ఎలా ప్రచారం చేస్తున్నారో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో క్లారిటీ ఇస్తూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే మహేశ్ నుంచి ఇలాంటి ఎమోషనల్ వీడియో రావడం డౌట్స్ రైజ్ చేస్తుంది..

Also read :యూరప్ టూర్‌కు రాజమౌళి సిద్ధం.. ‘RRR’ నుంచి ‘ఈగ’ వరకు స్పెషల్ స్క్రీనింగ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజ్, వేణు టిల్లు లాంటి వాళ్లు దర్శకులుగా మారి సక్సెస్ సాధిస్తుండటంతో, బహుశా మహేశ్ కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ లేదా తనే డైరెక్ట్ చేయబోయే సినిమా కోసమే ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాడేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, కమెడియన్ మహేశ్ క్రియేట్ చేసిన ఈ సస్పెన్స్ స్క్రీన్‌ప్లే వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో తెలియాలంటే అతను అధికారికంగా స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే.

Tags

Related News

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

‘కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

మిస్టర్ బీస్ట్‌తో రణ్‌బీర్.. ‘జై శ్రీరామ్’ అనిపించిన హీరో!

హిట్లర్ అనుకున్నా కానీ LKG పిల్లాడు..మోహన్ బాబు పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

కొబ్బరి మట్ట తర్వాత మోగని ఫోన్.. ప్యారడైజ్‌తో మళ్లీ మోగింది..సంపూర్ణేష్

శ్రీకాంత్ ఓదెలను దాసరితో పోల్చిన మోహన్ బాబు.. గ్రేట్ డైరెక్టర్ అంటూ!

Big Stories

Advertisement
×