E-Paper
Advertisement

మిగతా హీరోలు సెట్స్ పైకి.. మోక్షజ్ఞ మాత్రం ఇంకా ముహూర్తాల వేటలోనే!

మిగతా హీరోలు సెట్స్ పైకి.. మోక్షజ్ఞ మాత్రం ఇంకా ముహూర్తాల వేటలోనే!
Advertisement

Mokshagna Debut: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రం ఎప్పుడెప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు దాదాపు దశాబ్ద కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో మిగతా స్టార్ హీరోల వారసులంతా చకచకా స్క్రీన్ పైకి వచ్చేసి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతుంటే, మన ‘మోక్షు’ మాత్రం ఇంకా కథల చర్చలు, ముహూర్తాల వేటలోనే కాలం గడిపేస్తుండటం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందరు హీరోలు కెమెరా ముందుకు వెళ్లి ‘యాక్షన్’ అంటుంటే, మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఏ జ్యోతిష్యుడు ఏ పర్ఫెక్ట్ ముహూర్తం చెప్తాడా అని పంచాంగాలు తిరగేసే పనిలోనే బిజీగా ఉన్నాడంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్లే

గత రెండేళ్ళుగా  మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమంటూ టాలీవుడ్‌లో విపరీతమైన ప్రచారం జరిగింది. ముఖ్యంగా ‘హను-మాన్’ సినిమాతో గ్లోబల్ లెవెల్లో బ్లాక్‌బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ లాంచింగ్ మూవీ ఉంటుందని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా ఒక భారీ సోషియో ఫాంటసీ లేదా మైథాలజీ బ్యాక్‌డ్రాప్ కథను కూడా సిద్ధం చేశారని టాక్ నడిచింది. నందమూరి తాతల నాటి పౌరాణిక వైభవాన్ని గుర్తుచేసేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అందరూ ఆశపడ్డారు. బాలకృష్ణ సైతం స్వయంగా కొన్ని కథా చర్చల్లో పాల్గొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

Advertisement

Also read :సమంత వన్-వుమెన్ షో.. స్టార్ హీరోల రికార్డులను తిరగరాస్తోన్న ‘మా ఇంటి బంగారం’!

కానీ, ఏ ముహూర్తాన ఆ ప్రాజెక్ట్ అనుకున్నారో ఏమో కానీ, కొన్ని అనివార్య కారణాలు మరియు బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి పూర్తిగా హోల్డ్‌లో పడిపోయింది. కొందరైతే ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్లేనని కూడా గుసగుసలాడుకుంటున్నారు.

ఒక రకమైన ఓవర్ ప్రొటెక్టివ్ మైండ్‌సెట్‌

Advertisement

ఆ తర్వాత  ఆ మధ్య బాలయ్య అన్నట్టుగా  క్రిష్ దర్శకత్వం లో ఆదిత్య 999లో బాలయ్య బాబుతో ఈ బాబు ఏమైనా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తాడేమో అని ఆశగా ఎదురు చూశారు అభిమానులు.కానీ వాలకం చూస్తుంటే ఈ  2026 సంవత్సరంలో కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కే అవకాశాలు దాదాపు శూన్యంగానే కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ .

Also read :ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం.. జ్యోతిష్యుడి మాట నిజమైందా?

సాధారణంగా ఏ స్టార్ కిడ్ అయినా ఒకటి లేదా రెండు స్క్రిప్ట్స్ వినగానే ఓకే చెప్పేసి సెట్స్‌పైకి వెళ్ళిపోతుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం తన కొడుకు విషయంలో అత్యంత జాగ్రత్తగా, ఒక రకమైన ఓవర్ ప్రొటెక్టివ్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమానే బాక్సాఫీస్‌ను షేక్ చేసే పక్కా కమర్షియల్ మాస్ మసాలా సబ్జెక్ట్ అయి ఉండాలని, లేదా హాలీవుడ్ రేంజ్ విజువల్ వాల్యూస్ ఉన్న హై-ఎండ్ కథ అయి ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట. టాలీవుడ్‌లోని మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వంటి బడా బ్యానర్లు భారీ బడ్జెట్ ఆఫర్లతో, క్రేజీ కథలతో సిద్ధంగా ఉన్నప్పటికీ, బాలయ్యకు మాత్రం ఏ కథా పూర్తిగా సంతృప్తిని ఇవ్వడం లేదని టాక్.

టాలీవుడ్‌లో ఒక బేతాళ ప్రశ్న

ఈ ఆలస్యం చూస్తుంటే ఈ ఏడాది అంతా కేవలం రకరకాల కథలు వినడం, స్క్రిప్ట్ వర్క్‌లు మార్చడం, ప్రీ-ప్రొడక్షన్ పనులకే పరిమితం కానుంది. మిగతా యంగ్ హీరోలు ఏటా రెండు సినిమాలు రిలీజ్ చేస్తుంటే, మోక్షు మాత్రం ఇంకా ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టడానికే ముహూర్తాల కోసం చూసుకుంటున్నాడు. ఏదేమైనా, నందమూరి వారసుడిని వెండితెరపై చూడాలనే అభిమానుల ఆశ తీరడానికి మరికొంత కాలం ఓపిక పట్టక తప్పేలా లేదు. మోక్షు బాబు వెండితెర ఎంట్రీ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఒక బేతాళ ప్రశ్న గానే మిగిలిపోయింది.

Related News

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

‘కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

Big Stories

Advertisement
×