E-Paper
Advertisement

చిన్న వయసులోనే ఫిలింఫేర్ రికార్డ్.. మూడు సిల్వర్ జూబ్లీల హ్యాట్రిక్.. అదీ ఉదయ్ కిరణ్ రేంజ్

చిన్న వయసులోనే ఫిలింఫేర్ రికార్డ్.. మూడు సిల్వర్ జూబ్లీల హ్యాట్రిక్.. అదీ ఉదయ్ కిరణ్ రేంజ్
Advertisement

Uday Kiran :టాలీవుడ్ వెండితెరపై  “లవర్ బాయ్” అనే పదానికి సరికొత్త, డెఫినేషన్  చెప్పిన నటుడు ఉదయ్ కిరణ్ అమాయకత్వం,చెరగని నవ్వుతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆయన జయంతి నేడు. జూన్ 26, 1980న హైదరాబాద్‌లో జన్మించిన ఉదయ్ కిరణ్, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, కేవలం స్వయంకృషితో పరిశ్రమలోకి అడుగుపెట్టి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.

సరిగ్గా ఇరవై ఏళ్ల వయసులో, 2000 సంవత్సరంలో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్త నటీనటులతో వచ్చిన ఆ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద పెను తుఫాను సృష్టించి, అప్పటివరకు ఉన్న కమర్షియల్ ఫార్ములా ట్రెండ్స్‌ను పూర్తిగా మార్చేసింది.

వరుసగా మొదటి మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీ

Advertisement

ఆ తొలి విజయం ఒక సంచలనమైతే, ఆ తర్వాత 2001లో వచ్చిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలు టాలీవుడ్ రికార్డుల చరిత్రను తిరగరాశాయి. తేజ దర్శకత్వంలోనే వచ్చిన ‘నువ్వు నేను’ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలవడమే కాకుండా, ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ ఒక ఊపు ఊపింది. అదే ఏడాది ఎం.ఎస్. రాజు నిర్మాణంలో వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించిన ‘మనసంతా నువ్వే’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా మొదటి మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీ (100 రోజులకు పైగా) జరుపుకుని టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన ఏకైక యువ హీరోగా ఉదయ్ కిరణ్ సృష్టించిన రికార్డు నేటికీ చెరిపేయలేనిది.

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారే ప్రయత్నం

ఆ తర్వాత 2002లో వచ్చిన ‘కలుసుకోవాలని’ సినిమాతో తనలోని డాన్సింగ్ స్కిల్స్ ను కూడా ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇందులోని “గాజువాక పిల్లను” అనే సాంగ్ అప్పట్లో  ప్రతి ఫంక్షన్ లో మారుమోగిపోయింది. అదే ఏడాది  వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామ్’ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ యాక్షన్ హీరోగా మారే ప్రయత్నం చేశారు. ఇందులో ఉదయ్ కిరణ్ చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తేజ కాంబినేషన్ లోనే వచ్చిన ‘ఔనన్నా కాదన్నా’, అలాగే ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నీ స్నేహం’ చిత్రాలు ఆయనలోని పరిణతి చెందిన నటుడిని బయటకు తీశాయి. ‘నీ స్నేహం’ చిత్రంలో స్నేహం, ప్రేమ మధ్య నలిగిపోయే యువకుడిగా ఆయన నటన అద్భుతం.

Advertisement

Also read :కన్నడ స్టార్ దర్శన్ కొడుకు లగ్జరీ కారు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

చిన్న వయసులోనే ఫిలింఫేర్  అవార్డు

కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ పర్యవేక్షణలో ‘పొయ్’ (తెలుగులో ‘అబద్ధం’) అనే సినిమా చేయడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆ సమయంలోనే ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అత్యంత చిన్న వయసులోనే అందుకున్న రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నారు. ఉదయ్ కిరణ్ సినిమాల్లోని “ఆకాశం నీ హద్దురా”, “ఎటో వెళ్లిపోయింది మనసు”, “చెలియా చెలియా”, “ఉదయించె సూర్యుడైనా” వంటి పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ తర్వాత ఆయన ‘వియ్యాలవారి కయ్యాలు ‘, ‘నువ్వేక్కడుంటే నేనక్కడుంటా’, మరియు 2013లో వచ్చిన యాక్షన్ డ్రామా ‘జై శ్రీరామ్’ వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేశారు.

ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం

అయితే కథల ఎంపికలో దొర్లిన కొన్ని పొరపాట్లు, వరుస పరాజయాలు, మరియు వ్యక్తిగత జీవితంలోని పలు సంఘటనలు ఆయనను తీవ్రంగా కలచివేసాయి. ఒకప్పుడు స్టార్‌డమ్‌తో వెలిగిన ఆ నటుడు క్రమంగా పరిశ్రమలో మరియు మానసికంగా ఒంటరివారయ్యారు. దురదృష్టవశాత్తూ, 2014 జనవరి 5న ఆయన అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు. నేడు ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఉదయ్ కిరణ్ సినీ ప్రస్థానాన్ని, ఆయనతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను ఎంతో ఎమోషనల్‌గా గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి రికార్డుల రారాజుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Also read :షారుఖ్‌కు లైవ్ లోనే ఓపెన్ ప్రపోజల్.. ‘బాద్‌షా’ మైండ్ బ్లోయింగ్ పంచ్!

Related News

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

తెలంగాణ సంస్కృతి చూసి ఫరియా కంటతడి.. అసలేం జరిగిందంటే?వీడియో వైరల్!

ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

Big Stories

Advertisement
×