JD Chakravarthy: టాలీవుడ్‌లో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ జేడీ చక్రవర్తి.ముఖ్యంగా ఆయన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1998లో విడుదలైన ‘సత్య’ ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్.
ఇక ఈ సినిమానే బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు కొత్త దారి చూపిందనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది కూడా.ఈ సినిమాలో జేడీతో పాటు కలిసి నటించిన మనోజ్ బాజ్‌పేయి, ఉర్మిళ మటోండ్కర్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.ముఖ్యంగా జేడీ పోషించిన పాత్రకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారనే చెప్పాలి.అయితే ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకి ఇలా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చాడు..
షారుఖ్ ఖాన్ ఏమన్నాడంటే
‘సత్య’ బ్లాక్‌బస్టర్ అయిన వెంటనే మొదట తనకు ఫోన్ చేసింది హీరో సునీల్ శెట్టి అని తెలిపాడు.ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఫోన్ చేసి మాట్లాడాడని తెలిపాడు. “ఇప్పుడు బాలీవుడ్‌లో నీకు భారీ డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద బ్యానర్లు నిన్ను తీసుకోవాలని చూస్తున్నాయి. వాళ్లు నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో.. దాదాపు అదే రేంజ్‌లో నీకూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఇక్కడే ఎందుకు సినిమాలు చేయడం లేదు?” అని షారుఖ్ అడిగాడని చెప్పుకొచ్చాడు జేడీ.
అయితే జేడీ మాట్లాడుతూ “నాకు డబ్బు కంటే రాము ముఖ్యం. రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేయడమే నాకు ఇష్టం.సత్య తో ఒకసారి ఆల్ రెడీ హై వచ్చేసింది అని,ఇక రెండి సినిమా చేస్తే ఆ హై వస్తుందని నేను అనుకోనని పైగా రామూతో ఉంటే ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటాను. అందుకే బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనే ఆలోచనే చేయలేదు” అని షారుఖ్‌కి చెప్పానని అసలు విషయం చెప్పుకొచ్చాడు జేడీ.
also read :ఒక్క OTPతో రూ.15 లక్షలు మాయం.. ఏడ్చేసిన దొర సాయి తేజ!
సత్య సినిమా కోసం
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా జేడీ బయటపెట్టారు. చాలామందికి ‘సత్య’లో తాను నటించాడన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఆ సినిమా కోసం నటుడిగా మాత్రమే కాదు.. టెక్నీషియన్‌లా కూడా పనిచేశానన్నారు. తెలుగు, హిందీ, తమిళం వెర్షన్ల పనులని దగ్గర ఉండి చూసుకున్నానని చెప్పాడు.ముఖ్యంగా సౌండ్ డిజైన్ కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు పూర్తిగా ఆ సినిమాకే టైమ్ ఇచ్చానని తెలిపారు.
అదే టైమ్‌లో టాలీవుడ్‌లో కూడా తనకు వరుస సినిమాలు ఉండేవని జేడీ గుర్తు చేసుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘ప్రేమకు వేళాయెరా’తో పాటు మరో రెండు సినిమాలకు అప్పటికే కమిట్ అయి ఉన్నానన్నారు. ఒకవైపు హైదరాబాద్, మరోవైపు ముంబై.. ఇలా రెండు ఇండస్ట్రీల మధ్య తిరుగుతూ బిజీగా గడిచిపోయిందని చెప్పారు.
1989లో ‘శివ’సినిమాతో
జేడీ విషయానికి వస్తే 1989లో ‘శివ’సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన జేడీ చక్రవర్తి.. తర్వాత ‘గులాబీ’, ‘దెయ్యం’, ‘సత్య’, ‘కంపెనీ’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఆయన చేసిన జర్నీ ఇప్పటికీ చాలామంది మూవీ లవర్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు జేడీ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత.. “అప్పట్లో బాలీవుడ్‌లోనే కంటిన్యూ అయ్యుంటే ఇంకో లెవల్ స్టార్ అయ్యేవారు” అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. “డబ్బు కంటే మనసుకు నచ్చిన పని ముఖ్యం అని జేడీ అప్పుడే నిరూపించారు” అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలకు జేడీ ఇచ్చిన సమాధానం మాత్రం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
also read :మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!