E-Paper
Advertisement

ఒక్క OTPతో రూ.15 లక్షలు మాయం.. ఏడ్చేసిన దొర సాయి తేజ!

ఒక్క OTPతో రూ.15 లక్షలు మాయం.. ఏడ్చేసిన దొర సాయి తేజ!
Advertisement

YouTuber Dora Sai:అర్ధరాత్రి సమయంలో ఒక సెల్ఫీ వీడియో పెట్టి అందరినీ షాక్‌కు గురి చేశాడు ప్రముఖ యూట్యూబర్ దొర సాయి తేజ.”ఒక్క OTP వల్ల నా అకౌంట్‌లో ఉన్న రూ.15 లక్షలు క్షణాల్లో మాయం అయ్యాయి” అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీడియోలో కనిపించిన సాయి తేజ తనలోని ఆవేదనని బయటపెడుతూ నా డబ్బులు పోయాయని చెప్పడంతో ఒక్కసారిగా అంత డబ్బు పోయిందా అని కొంతమంది సానుభూతి తెలుపుతుంటే మరోవైపు కొందరు మాత్రం ఇది నిజంగా జరిగిన సంఘటనా లేక ఏదైనా ప్రమోషన్‌లో భాగమా అన్న డౌట్స్ రైజ్ చేస్తున్నారు.

అసలేమైంది అంటే 

Advertisement

సాయి తేజ చెప్పిన వివరాల ప్రకారం ముందుగా తన మొబైల్‌కు ఒక OTP మెసేజ్ వచ్చిందట. తాను అది పెద్దగా పట్టించుకోకముందే వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చిందని తెలిపాడు. ఆ కాల్ లిఫ్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే తన అకౌంట్ లోని డబ్బు అక్షరాల 15 లక్షలు కట్  అయిపోయిందని బాధ పడిపోయాడు.ఎన్నో ఏళ్లుగా సేవ్ చేసుకున్న మనీ అదని,ఒక్క దెబ్బకి మాయం అయిపోయిందని చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు.

ఇక ఆ వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేయడం మొదలెట్టారు.కొందరు మాత్రం  “OTP మాత్రమే వస్తే డబ్బు ఎలా పోతుంది?”, “ఏదైనా లింక్ క్లిక్ చేశాడా?”, “కాల్ లిఫ్ట్ చేస్తేనే అకౌంట్ ఖాళీ అవుతుందా?” అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

Advertisement

ఇటీవల ఇలాంటి ఆన్‌లైన్ మోసాల గురించి పోలీసులు కూడా పదేపదే హెచ్చరిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, OTPలు, స్క్రీన్ షేరింగ్ యాప్స్, KYC అప్‌డేట్ పేరుతో వచ్చే మెసేజ్‌లు, బ్యాంక్ అధికారులమంటూ మాట్లాడే మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ఆర్థిక నష్టానికి దారి తీసే అవకాశముందని చెబుతున్నారు.

ఎంతగా అవేర్నెస్

ఒక సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సైబర్ మోసాలపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అవేర్నెస్ కలిపించారు కూడా.ఇక బాధితులు తమ అనుభవాలని నెట్టింట షేర్ చేసుకున్నారు కూడా.ఏది ఏమైనా జనాల్లో ఎంతగా అవేర్నెస్ వచ్చినప్పటికీ ఇలాంటి సైబర్ నేరాలకి చెక్ పడకపోవడం ఇక్కడ గమనార్హం.

అయితేదొర సాయి తేజ ఇంత డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఏమైనా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడా అనే విషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.దీంతో అసలు నిజంగానే దొరతేజ డబ్బు పోగొట్టుకున్నాడా లేక ఏదైనా ప్రమోషన్ లో భాగంగా ఇలా రీల్ వదిలాడా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి రీల్ వెనకున్న అసలు ఫ్యాక్ట్ ఎప్పుడు బయట పడుతుందో !

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×