E-Paper
Advertisement

మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!

మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!
Advertisement

Luxury Apartment: స్టార్స్ ఏం చేసినా సంచలనమే.ఇక అభిమానులైతే వారి ప్రతి కదలికని భూతద్దం పెట్టి అబ్జర్వ్ చేస్తుంటారు.ఇదిగో అదే క్రమంలో ఇపుడు స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ,అనుష్క శర్మల జోడీ కొత్తగా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనడంతో అసలు ఈ ఇంటి ధర ఎంత ఉండే అవకాశం ఉందంటూ ఆరాలు తీస్తున్నారు విరుష్క ఫ్యాన్స్.

ఏకంగా రూ.18.29 కోట్లు 

Advertisement

ఇక వెర్సోవా ప్రాంతంలో కొన్న ఈ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ విలువ విషయంలో కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.అవును..ఈ కొత్త అపార్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ.18.29 కోట్లని,మొత్తం 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అపార్ట్మెంట్ తో పాటు మరో 316 చదరపు అడుగుల ప్రత్యేక స్థలం కూడా ఇక్కడ ఉందని తెలుస్తుంది.ఇక అపార్ట్మెంట్ తో పాటు మూడు కార్లను పార్క్ చేసుకునే పార్కింగ్ స్పేస్ కూడా వచ్చిందని సమాచారం.అసలే ముంబైలో పార్కింగ్‌కు కూడా చాలా డిమాండ్ ఉంటుంది.అలాంటి పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు.

2017 డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లి

Advertisement

ఇక విరాట్, అనుష్క ల విషయానికి వస్తే 2017 డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ స్టార్ జంట, 2021లో కుమార్తె వామికకు, 2024లో కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన సంగతి తెల్సిందే.ఇక ప్రస్తుతం వారు ముంబైలోని వోర్లీ ప్రాంతంలో సముద్రాన్ని ఎదురుగా ఉండే అత్యంత ఖరీదైన విల్లాలో ఉంటున్నారు.ఇక అలీబాగ్‌లో ఫామ్‌హౌస్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి కూడా.ఇక తాజాగా ఇప్పుడు వెర్సోవాలో మరో ఇల్లు కొనడంతో వీళ్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై మరోసారి డిబేట్స్ పెట్టేస్తున్నారు నెటిజన్లు.మొత్తానికి తాము సంపాదించే భాగంలో అధికంగా ఇలా భూమిపైనే పెట్టుబడి పెడుతున్నారన్న మాట.

ఈ సినిమాతోనైనా అనుష్క కమ్ బ్యాక్ ఇస్తుందో

ఇక విరాట్ క్రికెట్‌కు ఏ మాత్రం గ్యాప్ దొరికినా ప్రతిసారి కుటుంబంతో సమయం గడపడానికి  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడని సోషల్ మీడియాలో చూస్తేనే అర్థమయిపోతుంది.ఇక సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క  2018లో విడుదలైన Zero తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే. భారత మహిళా క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన Chakda Xpress సినిమాలో ఝులన్ గోస్వామి పాత్రని అనుష్క శర్మ పోషించడం విశేషం.అయితే సినిమా ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవడం గమనార్హం.చూడాలి ఈ సినిమాతోనైనా అనుష్క కమ్ బ్యాక్ ఇస్తుందో !

ఏది ఏమైనా మిగతా సెలెబ్రిటీలలో చాలా మంది పెళ్లి పీటలు ఎక్కినా కొన్నేళ్ళకే విడిపోతుంటే దాదాపు దశాబ్దం అయిన వీరి వివాహ బంధం చెక్కుచెదరకుండా ఉండటం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం!

also read :ఒక్క OTPతో రూ.15 లక్షలు మాయం.. ఏడ్చేసిన దొర సాయి తేజ!

 

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×