Jennifer Mistry:సినీ ఇండస్ట్రీలో ఆడవారికి భద్రత లేదు అంటూ ఇప్పటికే ఎంతోమంది తమ గళం విప్పారు. కొత్తగా వచ్చే ఎవరికైనా సరే అవకాశాలు కావాలి అంటే దర్శక నిర్మాతలు చెప్పినట్టు వినాల్సిందే అని.. లేకపోతే అవకాశాలు రాకుండా చేస్తారని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవకాశం కావాలి అంటే సీనియర్, జూనియర్ అని తేడా లేదని.. ఆడదైతే చాలు అని.. పక్కలోకి పిలుస్తారు అంటూ సీనియర్ హీరోయిన్లు సైతం మండిపడ్డారు. ఇలాంటి విషయాలన్నీ దాదాపు బయటకి రావు కానీ ఈ మధ్య సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ నటి కూడా చేరిపోయింది.
నిర్మాతపై క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ చేసిన నటి..
సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాలను పంచుకుంది. స్టార్ హీరోయిన్ ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని.. అవకాశాల పేరుతో లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు కూడా గురి చేస్తున్నారని ఆ నటి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఎవరో కాదు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్ జెన్నీఫర్ మిస్త్రీ (Jennifer Mistry). ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ముఖ్యంగా ఒక నిర్మాత తనను వేధించాడు అంటూ చెప్పుకొచ్చింది.
గదిలోకి రమ్మని బలవంతం చేశాడు – జెన్నీఫర్..
జెన్నిఫర్ మిస్త్రీ మాట్లాడుతూ..”తారక్ మెహతా కా ఉల్టా చష్మా లో నేను మిస్సెస్ రోషన్ సోధీ పాత్ర పోషించాను. ఈ పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది. దీని నిర్మాత అసిత్ కుమార్ మోది వల్ల నేను మానసిక క్షోభ అనుభవించాను. 2018లో షో ఆపరేషన్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది. ఇక అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్ కుమార్ మోదీ దగ్గరికి వెళ్తే.. అక్కడ అతడి ప్రవర్తన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నా ఫిర్యాదు పట్టించుకోకుండా నా బాడీ పై అసభ్యకర కామెంట్లు చేశారు.అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత 2019లో షూటింగ్ కోసం సింగపూర్ వెళ్తే.. నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ కూడా తాగమని బలవంతం చేశాడు.
ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు..
ఆ తర్వాత మేమంతా కలిసి ఒక చోట కాఫీ తాగుతుంటే.. నీ పెదాలు నన్ను నిద్ర రానివ్వకుండా చేస్తున్నాయి. ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే నేను ఆయన మాటలు పట్టించుకోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ మాటలు మాత్రం నాపై తీవ్ర మానసిక క్షోభకు గురిచేసాయి. అంటూ ఆ నిర్మాతపై కామెంట్ చేసింది జెన్నీఫర్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.