Annadatta Sukhibhava: రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. అదే రోజున ఏపీ అంతటా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు పడనున్నాయి.
పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపి కబురు వచ్చేసింది. 20వ విడత డబ్బులు ఆగస్టు 2న విడుదల కానున్నాయి. ఆరోజు వారణాసి పర్యటనకు పీఎం నరేంద్రమోదీ వెళ్తున్నారు. అదే రోజు ఆయా నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో 6000 వేల రూపాయలు విడుదల చేస్తోంది.
అదే రోజు ఆగస్టు 2న ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది కూటమి సర్కార్. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు కలిపి 7 వేల రూపాయలు రైతుల ఖాతాలో పడనున్నాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది 6000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 14 వేల రూపాయలు కలిపి మొత్తం 20వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
కౌలు రైతులకు ఆయా నిధులు విడుదల కావు. ఎందుకంటే వారికి పీఎం కిసాన్ స్కీమ్ ఉండదు. అందువల్ల 14 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెండో విడతలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం 40.64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.
ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన సిట్, రూ.11 కోట్లు సీజ్
అన్నదాత సుఖీభవ పథకం 40.64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. అయితే ఇప్పటికే దాదాపు 46.20 లక్షల మంది ఈ-కేవైసీ పూర్తి చేశారు. 40,364 మంది మాత్రమే ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ స్టేటస్‌ని తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లేదా యాప్‌లో ఆధార్ సహాయంతో చెక్ చేసుకోవచ్చు. తొలుత https://annadathasukhibhava.ap.gov.in/ లింకు క్లిక్ చేయాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే మీకు know your status అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ సాయంతో వివరాలు తెలుకోవచ్చు.