Illu Illalu Pillalu ToIlluday Episode july 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ప్రేమ ధీరజ్ బయటి ఉండిపోయి ఉంటారు అని సంతోషంగా డాన్సులు వేస్తూ లోపలికి వస్తుంది.. ధీరజ్ ప్రేమ లోపల ఉండటం చూసి షాక్ అవుతుంది.. ప్రేమను పిలిచి ఎలా వచ్చారు లోపలికిని అడుగుతుంది.. కానీ ప్రేమ మాత్రం నాకు ఏమీ తెలియదని చెప్తుంది.. అయితే శ్రీవల్లి ఆలోచిస్తూ కిటికీను పట్టుకుంటుంది. ఆ కిటికీ లోంచి శ్రీవల్లి లోపలికి పడుతుంది. కిటికీ నీ తీసి లోపలికి వచ్చారా అని పెద్ద పంచాయతీనే పెడుతుంది.. రామరాజు కచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని శ్రీవల్లి చెప్తుంది. ఈ విషయాన్ని కచ్చితంగా మావయ్య గారితో చెప్పి వాళ్లకి శిక్ష పడేలా చేయాలి అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. కేకలు వేసి అందరిని ఒక చోటికి చేరుస్తుంది శ్రీవల్లి. కచ్చితంగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి మామయ్య అని శ్రీవల్లి రామరాజుని అడుగుతుంది.. నువ్వేం చేయాలనుకుంటే అది చేయమని రామరాజు అంటాడు. ప్రేమ నర్మదలకు ఇద్దరికీ బాధ్యతలు అప్పగిస్తుంది. టార్చర్ ఇంకా పెంచుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..రైస్ మిల్లుకు వెళ్లిన నర్మద సాగర్ ని చూసి నర్మదా బాధపడుతుంది రామరాజు మాత్రం సాగర్ మీ భార్యని దగ్గర దించిరా అని అంటాడు.. ప్రేమ ఇంట్లో పనులు చేయడం చూసి బాధపడిన ధీరజ్.. నువ్వు అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు.. నీ భార్య అనే ట్యాగ్ నాకు ఉంది కదా.. నువ్వు నన్ను భార్యగా గుర్తించకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నేను నీ భార్యనే. మీ పెద్ద వదిన ఇవంతా చేయమని చెప్పింది అని ప్రేమ అనగానే నేను ఇప్పుడే వెళ్లి వదినను అడుగుతాను అని ధీరజ్ అంటాడు. ఏమని అడుగుతావు? ఎందుకు అడుగుతావని ప్రేమ అంటుంది. దీంట్లో వస్తువుతో సమానం అన్నావు కదా నా గురించి ఎందుకు నువ్వు అడగాలి అని ప్రేమ. ధీరజ్ ని కడిగి పడేస్తుంది ప్రేమ.
అటు సాగరు వాళ్ళ నాన్న చెప్పాడని నర్మదను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. అయితే నర్మద మాత్రం నేను బండి ఎక్కను అని అంటుంది. మీ నాన్న చెపితే వచ్చావా అంటే నేను అక్కర్లేదా నీకు అని సాగర్ ని కడిగి పడేస్తుంది. నీకు నేను అవసరం లేదని అర్థం అయిపోయింది.. పెళ్లికి ముందు నువ్వు ఎలా నా చుట్టూ తిరిగావో పెళ్లయిన తర్వాత నన్ను ఎంత దూరం పెడుతున్నావో నీకే తెలియాలి అని అంటుంది. నీకు నేను అవసరం లేదని అర్థం అయిపోయింది అలాంటప్పుడు నువ్వు నాకేం అవసరం లేదు.. నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని నర్మద అంటుంది..
ఇక ఇంట్లో వాళ్ళందరూ రాత్రి భోజనానికి కూర్చుంటారు. ప్రేమ నర్మదా రాకపోవడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఎక్కడున్నారు అని అడుగుతాడు రామరాజు.. భోజనం దగ్గర అందరూ కలిసే తింటామని తెలుసు కదా అందరిని వెళ్లి పిలువు అని అమూల్యతో చెప్తాడు.. శ్రీవల్లి మాత్రం వాళ్లందరూ కలిసిపోయారని మీకు జరిగిన అవమానం తలుచుకుంటే నాకు ముద్ద కూడా దిగడం లేదు అని అంటుంది.. ఆ మాట వినగానే రామరాజు ప్లేట్ అక్కడ విసిరేసి లేచి వచ్చేస్తాడు.. వేదవతి వెనకాలే వచ్చి మీరు భోజనం చేయకపోతే మాకు ముద్ద కూడా దిగదండి అని బ్రతిమలాడుతుంది..
కానీ రామరాజు మాత్రం వాళ్ళు నన్ను ఎంతగా అవమానించారో.. కోడళ్ళ సంపాదనతో నేను ఇంటిని నెట్టుకొస్తున్నానని అంటున్నారు.. మన పెళ్లయినప్పటి నుంచి ఏదో ఒక మాట అంటున్న కూడా అది దానివరకే అని మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఇలా అనడం నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మీరు అందుకేనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొనిందని మరోసారి అగ్గి రాజేస్తుంది.. ఇంకా ధీరజ్, సాగర్ నాన్న కళ్ళలో నీళ్ళు చూడడం మనకు బాధగా అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు.. నర్మదా తప్పు చేసింది అని అంటాడు సాగర్. ధీరజ్ మాత్రం వదిన తప్ప ఏమీ లేదురా అంతా ప్రేమదే తప్పు అని అంటాడు.
Also Read: పార్వతికి షాకిచ్చిన రాజేంద్రప్రసాద్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అవని దెబ్బ అదుర్స్..
ప్రేమది నర్మది ఇద్దరిదీ తప్పే అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన చందు.. ప్రేమ నర్మల్ది కాదురా తప్పు. మీరిద్దరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే ఒకరి ప్రేమని ఒకరు అంగీకరించి అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు కదా.. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఇంట్లోకి జరుగుతున్న గొడవలు కి వాళ్లే కారణమని వాళ్ళ మీద తోసేస్తున్నారు అని చందు అంటాడు. నీ భార్యల గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగులుతుంది అని చందు అంటాడు. నువ్వు కష్టపడ్డాం చూడలేకే ప్రేమ జాబ్ చేయాలని అనుకునింది. తన గురించి నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు ఇంత గొడవలు జరిగేవి కాదు కదా అని చందు అంటాడు. నువ్వంటే ప్రేమకి చాలా ప్రేమ. అని చందు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..