 
					Bigg Boss 9 Telugu: ప్రతిసారి కూడా బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు కొంతమంది మీద పక్షపాతం చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి ఆరోజు జరిగిన హైలెట్స్ అన్ని కూడా ఒక సింగిల్ ఎపిసోడ్ లాగా టెలికాస్ట్ చేస్తారు అనే విషయం తెలిసిందే. అయితే మొదటి సీజన్ నుంచి ఇది జరుగుతుంది. కొన్ని సీజన్స్ జరిగిన తర్వాత ఏకంగా 24 గంటలు షో చూసే అవకాశం కల్పించే విధంగా ప్లాన్ చేశారు..
24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ చూసిన వాళ్ళకి కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా లైవ్ స్ట్రీమింగ్ లో జరిగిన హైలెట్స్ ని కట్ చేసి ఎపిసోడ్ గా ప్లే చేస్తారు. అయితే లైవ్ స్ట్రీమ్ లో జరిగిన కొన్నింటిని ఎపిసోడ్లో చూపించకపోవడం అనేది చాలామందికి విపరీతమైన సందేహాలను క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షో పైన సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తుంది.
కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. మొదట అగ్నిపరీక్షలోనే చాలా టాస్కులు అద్భుతంగా ఆడి తన టాలెంట్ ఏంటో స్టేజ్ పైన చూపించాడు. కాళ్లు పైకి పెట్టి చేతులతో నడవడం, జంప్స్ కొట్టడం ఇలాంటివి ఎన్నో పవన్ చేశాడు.
హౌస్ లో కూడా పవన్ టాలెంట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. టాస్కులు ఆడుతున్నప్పుడు భరణితోపాటు ఇంకొక వ్యక్తిని కూడా హోల్డ్ చేయగలిగాడు ఒక మనిషి ఇద్దరిని ఆపడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ లో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎవరు చూసుండరు.
అయితే పవన్ టాలెంట్, పవన్ స్టామినా, డైలీ వచ్చే ఎపిసోడ్లో చూపించడం లేదు. కేవలం బిగ్ బాస్ యాజమాన్యం ఎవరినైతే విన్నర్ గా నిలబెట్టాలి అనుకుంటుందో వాళ్లను మాత్రమే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఎపిసోడ్ కట్ చేస్తున్నారు అని అనుమానాలు కూడా వస్తున్నాయి.
కొన్ని విషయాలు కేవలం తనుజాకు మాత్రమే సీక్రెట్ రూమ్ కి పిలిపించి చూపించటం. అలానే తనను ఏదైనా ఒక మాట అంటున్న తరుణంలో బిగ్ బాస్ దానిని కట్ చేయడం ఇలాంటివి చాలా ఉదాహరణలు జరిగాయి. శ్రీజ వచ్చి మాట్లాడుతున్న తరుణంలో కూడా బిగ్బాస్ మధ్యలో కలగజేసుకొని మీరు వచ్చిన పని చూడండి అంటూ చెప్పారు. దీనిని బట్టి తనుజాకి యాజమాన్యం నుంచి ఎంత సపోర్ట్ ఉందో అర్థమవుతుంది.
Also Read: Bigg Boss Telugu 9 : పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ కంటెస్టెంట్, పూర్తి ఆధారాలున్నాయంటూ ఆవేదన