E-Paper
Advertisement

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.
Advertisement

Kaalanki Bhairavudu: సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు..కథలో కంటెంట్ ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు ఇప్పటి ఆడియన్స్ .అందుకే సినిమా ఏదైనా బాగుంటే గుండెల్లో పెట్టేసుకుంటున్నారు.ఇదిగో ఇపుడు అలాంటి కథ తోనే వస్తున్న సినిమా ‘కాళాంకి భైరవుడు’.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ మ్యాజిక్, చేతబడులు, క్షుద్ర పూజలు, మిస్టరీ వంటి అంశాలతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి  అంచనాలున్నాయి.ఇక ఈ క్రమంలోఈ సినిమా నుంచి ‘ఏంటో ఏమో’ అనే మెలోడీ పాటను విజయవాడలో ఘనంగా విడుదల చేశారు మూవీ మేకర్స్.

విజయవాడ ఎంజీ రోడ్డులోని లైలా మాల్‌లో ఉన్న INOX థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్ వర్మ, హీరోయిన్ రితికా చక్రవర్తి, దర్శకుడు హరిహరన్, నిర్మాతలు కె.ఎన్. రావు, రాచమల్ల శ్రీనివాసరావు ..ఇలా సినిమా యూనిట్ మొత్తం అటెండ్ కాగా అభిమానుల మధ్య పాటను విడుదల చేయడం విశేషం.

Advertisement

నిర్మాత మాట్లాడుతూ

ఈ సందర్భంగా నిర్మాత రాచమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని,ఇక సినిమా అందరికి నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

Advertisement

ఇక దర్శకుడు హరిహరన్ మాట్లాడుతూ, విజయవాడ అంటే తమకు చాలా ఇష్టమని, అందుకే ఇక్కడే పాటను విడుదల చేశామని చెప్పారు. ఇప్పటికే వచ్చిన “పద పద” పాటకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారని, ఇప్పుడు విడుదలైన “ఏంటో ఏమో” కూడా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ముఖ్యంగా ‘శ్రీదేవి’ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుందని తెలిపారు.

హీరో మాట్లాడుతూ

హీరో రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ, విజయవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇక్కడే చదువుకున్నానని, అందుకే ఈ నగరం ఎప్పటికీ తనకు స్పెషల్ అని చెప్పారు. దర్శకుడు హరిహరన్ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తన పాత్ర కొత్తగా ఉంటుందని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుకుంటారని అన్నారు. ఈ సినిమాకు మొదటి హిట్ టాక్ విజయవాడ నుంచే వస్తుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

also read :‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

హీరోయిన్ మాట్లాడుతూ

హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ, తమ సినిమాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. “ఏంటో ఏమో” పాటను సోషల్ మీడియాలో రీల్స్ చేసి మరింత వైరల్ చేయాలని అభిమానులను కోరారు. దర్శకుడు హరిహరన్‌తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. చివరగా “విజయవాడ… వీ లవ్ యూ” అంటూ అభిమానుల్లో మరింత జోష్ నింపారు.

గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీ.ఆర్ సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీజర్‌తో ఇప్పటికే ఆసక్తి పెంచిన ‘కాళాంకి భైరవుడు’ ఇప్పుడు “ఏంటో ఏమో” పాటతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్స్ మరింత జోరుగా జరగబోతున్నాయని తెలిపింది మూవీ టీమ్.

Tags

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×