E-Paper
Advertisement

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్
Advertisement

Ramayana Trailer:‘రామాయణ’..’రామాయణ’..’రామాయణ’..ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్.ముఖ్యంగా ట్రైలర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టేస్తున్నారు.ఇక ఇప్పటికే  దీనిపై ఏంతో మంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని చెప్పగా తాజాగా మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ట్వీట్ సినిమా హైప్‌ను ఇంకా పెంచేసింది.

“YEH RAM YUG KA AARAMBH HAI. Not just a trailer, but the eternal reminder that DHARMA will always triumph over ADHARMA.”అంటూ వంగా చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అంటే.. “ఇది కేవలం ట్రైలర్ కాదు.. ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుందనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది” అన్నట్టుగా ఆయన తన అభిప్రాయాన్ని ట్విటర్ లో రాసుకొచ్చారు.

Advertisement

సందీప్ రెడ్డి వంగా తనకు నిజంగా నచ్చిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతాడన్న సంగతి తెల్సిందే.అలాంటి దర్శకుడు ‘రామాయణ’ ట్రైలర్‌పై ఇలా స్పందించడంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే

Advertisement

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. భారీ విజువల్స్, అద్భుతమైన VFX, గ్రాండ్ సెట్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వేసిన శ్రీరాముడు, సీత, రావణుడి పాత్రలను చూపించిన విధానం కూడా మంచి ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్‌లో కనిపించిన ప్రతి ఫ్రేమ్‌ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం మేకర్స్ భారీ స్థాయిలో కష్టపడిన విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయిలో చూపించాలని టీమ్ ప్రయత్నించినట్లు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అందుకే సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

also read :ప్రియాంక జైన్ షాకింగ్ సాంగ్.. అందాల విందుపై నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్, ఇదిగో వీడియో!

ఇక సందీప్ రెడ్డి వంగా ట్వీట్ తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలామంది సినీ అభిమానులు కూడా ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు. “ఇది ట్రైలర్ మాత్రమే కాదు.. థియేటర్లలో మరో లెవల్ అనుభవం ఇవ్వబోతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ అంచనాలని ఏ మేరకి అందుకుంటుందో

ప్రస్తుతం #Ramayana, #RamYug, #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే కనిపిస్తున్న హైప్ చూస్తుంటే రిలీజ్ తర్వాత కూడా భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా చేసిన ఒక్క ట్వీట్.. ‘రామాయణ’ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి అందరికీ గుర్తు చేసిందని చెప్పక తప్పదు.చూడాలి మరి నితీష్ తివారీ దర్శకత్వంలో దీపావళి కానుకగా నవంబర్ 5న వస్తున్న ఈ సినిమా ఆ అంచనాలని ఏ మేరకి అందుకుంటుందో !

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×